Cooking Oils at Low Price on Ration Card from Today in AP : రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో నేటి (అక్టోబర్ 11) నుంచి నెల ఆఖరు వరకు పామోలిన్ లీటరు (850 గ్రాములు) రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంటనూనెల సరఫరాదారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ధరల నియంత్రణపై వారితో చర్చించారు. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజి ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు మంత్రికి వివరించారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా, రాష్ట్రమంతా ఒకే ధరపై విక్రయించాలని మంత్రి నాదేండ్ల వారికి సూచించారు.
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ - త్వరలో కొత్త రేషన్ కార్డులు
రాజమహేంద్రవాసులకు తీపికబురు - ఇకపై రేషన్ షాపులో ఆ సరకులు కూడా - Good News For Ration Card Holders