Co Operative Bank Meeting In Hyderabad : సహకార సంఘాలు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తాయని డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య తెలిపారు. తుర్కయంజాల్లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో సహకార సంఘం 50వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ సెక్రటరీ రాందాస్ గడిచిన ఆరు నెలల కాలంలో జరిగిన ఆర్ధిక లావాదేవీల జమ, ఖర్చులను చదివి వినిపించారు. అనంతరం సత్తయ్య మాట్లాడుతూ గడిచిన ఆర్ధిక సంవత్సరంలో సంఘం దాదాపు రూ. 3 కోట్ల 22 లక్షల పై చిలుకు నికర లాభం గడించిందన్నారు. సకాలంలో అప్పులు చెల్లించిన సభ్యులకు, ఖాతాదారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
కొత్తగా బ్యాంక్ లాకర్ తీసుకోవాలా? ఈ రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి!
Co Operative Bank Meeting : బ్యాంకు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన సిబ్బందిని కొనియాడారు. రైతులు ఇప్పటి వరకు తీసుకున్న అన్ని రకాల రుణాలను, కిస్తులను సకాలంలో చెల్లించి బ్యాంకుకు సహాయం చేయాలని కోరారు. సంఘం నుంచి వ్యవసాయ అప్పు తీసుకున్న తరువాత అప్పుదారు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు సంఘం నుంచి వారి కుటుంబ సభ్యులకు రూ. 25 వేలు ఆర్ధిక సహాయం ఇస్తున్నామన్నారు. సభ్యులకు వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరములు మొదలగు వాటిపై సబ్సిడీని సంఘమే భరించి రైతులకు అందజేస్తుందన్నారు.
కొహెడలో 5 ఎకరాల స్థలంలో డీసీసీబీ ఋణ సహకారంతో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్ఢ్యం గల రెండు గోదాముల నిర్మించామన్నారు. 1500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగి నిర్మాణ దశలో ఉన్నదని తెలిపారు. ఈ సమావేశంలో సహకార సంఘం మాజీ చైర్మన్ రొక్కం భీంరెడ్డి, జిల్లా రైతు సంఘం మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, తుర్కయంజాల్ సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు ఉద్యోగులకు 17% శాలరీ హైక్- వర్కింగ్ డేస్ అయిదే!
బ్యాంక్ ఉద్యోగులకు గుడ్న్యూస్- ఇకపై వారానికి 5 రోజులే పని!- శాలరీ హైక్!!