CM Revanth Inquiry on ORR Toll Tenders : అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth) ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ఓఆర్‌ఆర్ టెండర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు(ORR Toll Tenders) ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది? ఏయే సంస్థలున్నాయి? ఎవరెవరు బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రాపాలీకి సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే, వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినేట్లో చర్చించి టోల్ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
Vechicles Speed In crease On ORR : ఓఆర్ఆర్పై 100 కాదంట.. ఇక నుంచి 120KMPH వెళ్లొచ్చు
ORR Toll Tenders Scam : టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి నెలా గరిష్ఠంగా టోల్ వసూళ్లతో ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అలాంటప్పుడు 30 ఏళ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్‌బీ కంపెనీకి ఎలా అప్పగించారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
హెచ్ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించటం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డీపీఆర్‌ను ఎంచుకుందని చర్చకు వచ్చింది. అందుకే ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే, నిజాలు బయటకు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ORR lease agreement scam : 'దిల్లీ లిక్కర్ స్కామ్ కంటే.. ఓఆర్‌ఆర్ లీజు వెయ్యిరెట్ల పెద్ద స్కామ్'
ORR Controversy: 'ఓఆర్ఆర్ లీజు టెండర్లలో ప్రభుత్వ పెద్దల గోల్మాల్'