ETV Bharat / state

తెలంగాణలో రేవంత్ రెడ్డి మార్క్ పాలన- సీఎం మదిలో 'హైడ్రా' - HYDRA for Disaster Management

HYDRA for Disaster Management in Hyderabad : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పరిపాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి అన్ని రంగాల బలోపేతం దిశగా కృషి చేస్తున్న సీఎం, మహా నగరంలో ప్రధాన సమస్యగా మారిన విపత్తుల నిర్వహణపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇందుకోసం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌) అనే ఓ ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారు.

cm revanth reddy announced special unit HYDRA
cm revanth reddy announced special unit HYDRA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 10:09 PM IST

Hyderabad Disaster Response and Assets Monitoring Protection : తెలంగాణ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్, భాగ్యనగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరంలో ప్రధాన సమస్యగా మారిన విపత్తు నిర్వహణపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. నగరంలోని చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమణలకు గురవడమే ఇందుకు కారణంగా భావించిన ప్రభుత్వం, ఈ సమస్యకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాజధాని మహా నగరంలో విపత్తుల నిర్వహణ కోసం 'హైడ్రా' (HYDRA) (హైదరాబాద్ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల వంటి వాటిని సంరక్షించడం ఈ విభాగం పని.

హైదరాబాద్‌ భౌగోళిక పరిధిని విస్తరించనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల దీనికి శ్రీకారం చుట్టారు. జీహెచ్‌ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించనుంది. డీఐజీ స్థాయి అధికారి ఈ విభాగానికి డైరెక్టర్‌గా, ఎస్పీ స్థాయి అధికారులు అదనపు డైరెక్టర్లుగా ఉంటారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలు ఈ విభాగంలో పని చేస్తాయి.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణ - Telangana Local Body Elections

జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడున్న ఎన్​ఫోర్స్​మెంట్​ విజిలెన్స్​ అండ్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ విభాగాన్ని అందుకు అనుగుణంగా పునర్​ వ్యవస్థీకరించాలని రేవంత్ ఆదేశించారు. జీహెచ్​ఎంసీతో పాటు ఓఆర్​ఆర్​ వరకు నగరంలోని 2వేల చ.కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించాలని సూచించారు.

ప్రజలకు నిరంతరం సేవలు అందించేలా : వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా, నగర ప్రజలకు నిరంతర సేవలు అందించేలా ఈ హైడ్రా విభాగం పని చేయనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించడం, నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగంలోని ప్రత్యేక బృందాలు చూసుకుంటాయి. ఇంతేకాకుండా భారీ హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగు నీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణలోనూ ఈ విభాగం సేవలందిస్తుంది.

హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించాలి? : అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని రేవంత్ చెప్పారు. విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు, ట్రాఫిక్​ నిర్వహణ, తాగునీరు, విద్యుత్​ సరఫరాలో హైడ్రా కీలకంగా వ్యవహరించేలా విధులు అప్పగించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా- తెలుగు సీఎంల సమావేశం - CHANDRABABU REVANTH REDDY MEETING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.