ETV Bharat / state

పొరుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ సీఎం ప్రచారాలు - అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కసరత్తులు - CM Revanth Campaign in Other States - CM REVANTH CAMPAIGN IN OTHER STATES

CM Revanth Reddy Campaign in Other States : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చరిష్మాను తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన చోట ప్రచారానికి వెళ్లాలని ఆ పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. ఈ మేరకు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగనున్నారు.

cm_revanth_reddy_campaign_in_other_states

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 1:26 PM IST

పొరుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ సీఎం ప్రచారాలు

CM Revanth Reddy Campaign in Other States : కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించటమే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకత్వం అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే ఐదు గ్యారంటీలతో పాటు సబ్బండ వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చేట్లు రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టింది. మరోవైపు ఆయా రాష్ట్రాలలో పీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చాలా రాష్ట్రాల్లో అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసి ప్రచారం చేస్తున్నారు.

Lok Sabha Elections 2024 : ఈ నేపథ్యంలోనే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటకలో అధికార పగ్గాలు చేపట్టిన ఆ పార్టీ అదే స్ఫూర్తితో పనిచేసేలా నాయకులకు దిశానిర్దేశం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Campaign 2024) చరిష్మాను తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 50కి పైగా బహిరంగ సభలు నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తుండగా రేవంత్‌రెడ్డి ప్రచారబరిలోకి దిగనున్నారు.

'ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరు - ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందాం'

అదే విధంగా, తెలంగాణ పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాల పరిధిలోని ప్రాంతాల్లోనూ రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్‌ భారీగా పెరిగింది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇటీవల వైజాగ్‌లో ఏపీసీసీ నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్‌రెడ్డి హాజరుకాగా విశేష స్పందన లభించింది.

రేవంత్‌రెడ్డిని క్రేజ్‌ను ఇతర రాష్ట్రాల్లో వాడుకునేలా : ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి క్రేజ్‌ను ఇతర రాష్రాల్లోనూ వాడుకునేలా కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో హస్తం పార్టీ అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం చేస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. అధిష్ఠానం నిర్ణయం మేరకు ఇవాళ మహారాష్ట్రలో రేవంత్‌రెడ్డి ప్రచారం చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో పర్యటన రద్దైంది.

ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో రేవంత్‌రెడ్డి ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని బహిరంగ సభల్లో పాల్గొంటారనే తదితర విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు పక్కరాష్ట్రాల్లో పలు నియోజకవర్గాల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చెయ్యాల్సి ఉండడంతో ఆయన మరింత బిజీ అవుతారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.

ఏపీలో తెలంగాణ సీఎం పర్యటన తేది ఖరారు- విశాఖలో కాంగ్రెస్‌ బహిరంగ సభకు హజరు కానున్న రేవంత్

Telangana Congress Focus on Lok Sabha Polls : మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటికే 14 లోక్‌సభ స్థానాలకు (T CONGRESS MP CANDIDATES) అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా మిగిలిన మూడు స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహణ, ఏ ఏ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలను నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 18న ఎన్నికల షెడ్యూల్ రానుంది. నామినేషన్లు వేసిన తర్వాత నుంచి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.

సీఎం హోదాలో తొలిసారిగా నేడు ఏపీలో అడుగుపెట్టనున్న రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.