CM Revanth Reddy about Common People : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాదిరి కాకుండా తాను సామాన్య జనానికి సైతం అందుబాటులో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇవాళ సాయంత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను ఆయన నేరుగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సందర్శకులను కలుసుకుని వారి బాధలను నేరుగా వినడంతోపాటు సంబందిత శాఖలకు సూచనలు కూడా చేశారు.
కొన్ని సమస్యలను ఎన్నికల నియమావళి ముగియగానే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారని తెలుస్తోంది. రెవెన్యూ ఉద్యోగి దయాకర్ కలిసి తనకు 317 జీవో కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేయగా లోకసభ ఎన్నికల నియమావళి ముగియగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ 'నేను చేరలేని దూరం కాదు. దొరకనంత దుర్గం కాదు. సామాన్యుడు మనిషిని నేను. సకల జనహితుడను నేను.'అని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యినప్పటికీ సామాన్య జనంతో కలిసిపోయే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా భావం వచ్చేట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
-
నేను…
— Revanth Reddy (@revanth_anumula) March 23, 2024
చేరలేని దూరం కాదు…
దొరకనంత దుర్గం కాదు…
సామాన్యుడు మనిషిని నేను…
సకల జన హితుడను నేను. pic.twitter.com/SkJscukilk
కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనానికి కారణమేంటో చెప్పాలి? : కిషన్‌రెడ్డి - Kishan Reddy Slams KCR