CM Jagan About YSRCP Candidates in Bus Yatra : విజయనగరం నుంచి వైసీపీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్‌తోపాటు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులంతా సౌమ్యులు, మంచివారు, వెన్నలాంటి మనసున్న వారని సీఎం జగన్ కితాబిచ్చారు. విజయనగరం జిల్లా చెల్లూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సుయాత్రలో వారిని ప్రజలకు పరిచయం చేశారు. ఐదు సంవత్సరాలుగా విజయనగరం జిల్లాలో భూకబ్జాలు, అక్రమ మైనింగ్, సెటిల్‌మెంట్లు, దౌర్జన్యాలకు పాల్పడిన నాయకులెవరో సీఎం జగన్ కనుక్కుని ఓటర్లకు వివరిస్తే బాగుండేదేమో అని జిల్లా వాసులు అంటున్నారు. ఇంతకీ అమంచి అభ్యర్థుల గురించి జగన్ ఏమన్నారో వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం.
బొత్సపై జగన్ అభిప్రాయం: ఇది బొత్స సత్యనారాయణపై జగన్‌కు ఉన్న అపార గౌరవం. కానీ ఆయన ప్రాతినిధ్యం వహించే చీపురు పల్లి నియోజకవర్గాన్ని ఒక కుటుంబం కొన్నేళ్లుగా శాసిస్తోంది. అక్కడ వారు చెప్పిందే వేదం. చేసిందే నిర్ణయమన్నట్లు ఉంది. మరి మీరు మంచివారనే బొత్స సత్యనారాయణకు వాళ్ల సంగతి ఏమైనా తెలుసా? భూవివాదాలైనా, ఇతర ఆస్తుల గొడవలైనా ఈ కుటుంబమే సెటిల్‌మెంట్లు చేస్తుందని, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి ఉద్యోగుల వరకు వీరు చెప్పినట్లు చేయాల్సిందేనని అంటున్నారు. సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులను అమ్ముకుంటున్నారని బొబ్బిలిలోని పారిశ్రామిక గ్రోత్ సెంటర్‌లో ఒక నాయకుడి సోదరుడు తక్కువ ధరకే భూమి దక్కించుకున్నారనే విషయమైనా మంత్రి బొత్స దృష్టికి వచ్చిందో లేదో? కాస్త ఆరా తీసి ఓటర్లకు వివరిస్తారా జగన్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సిద్ధం యాత్రతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న జగన్ - ఎండ తీవ్రతతో బస్సుల కింద! - Jagan Bus Yatra
ఎమ్మెల్యే అప్పల నరసయ్య: గజపతినగరం ఎమ్మెల్యే అప్పల నరసయ్య గురించి సీఎం చెప్పిన హితోక్తులు. ఇలా వెన్నలాంటి మనసున్న నాయకుడొకరు గజపతినగంలో తాము వేసే లేఅవుట్లకు ప్రభుత్వ నిధులతో రోడ్లేయిస్తారట. పట్టణంలో బాహ్యవలయ రహదారి పేరుతో తమ భూముల విలువలూ పెంచుకున్నారట. తన నియోజకవర్గంలో జరిగే ఈ అక్రమాలు అప్పల నరసయ్యకు తెలిసే ఉంటాయి కదా కాస్త కనుక్కుంటారా జగన్ అని అక్కడి స్థానికులు అడుగుతున్నారు. కె. కొత్తవలస, ఎం.గుమడాం గ్రామాల్లో రైతుల మధ్య భూవివాదాలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు భూములు కొట్టేసి లాభాలు దండుకున్న ప్రముఖులెవరో తెలుసుకుని ఓటర్లకు చెబుతారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
భూకబ్జాల సౌమ్యుడు వీర భద్రస్వామి: వెన్నలాంటి మనసున్న వీర భద్రస్వామికి విజయనగరంలో అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఆస్తులు స్వాధీనం చేసుకునే నాయకుల సంగతి ఏమైనా తెలుసో లేదో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు కొని అదే భూమిని మళ్లీ ప్రభుత్వానికే ఎక్కువ ధరకు అమ్ముకున్న నాయకులెవరో కాస్త కనుక్కోకూడదూ అని సీఎంను జనాలు నిలదీస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే రెవెన్యూ, పోలీసు, నగరపాలక సంస్థ, రిజిస్ట్రేషన్లు తదితర ప్రభుత్వ శాఖల్లో ఏ పని కావాలన్నా కప్పం కట్టాల్సిందేనట. వ్యాపారం ప్రారంభిస్తే అందులో వాటా ఇవ్వాల్సిందేనట అని అక్కడి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇవన్నీ చేసేదెవరో, నియోజకవర్గాన్ని గంజాయి మాఫియాకు కేంద్ర బిందువుగా మార్చిందెవరో సౌమ్యుడైన వీరభద్రస్వామి మీకు ఏమైనా చెప్పారా? లేదా? కాస్త ఆరా తీయండని జగన్‌ను సామాన్యులు అడుగుతున్నారు.
చెల్లమ్మ ప్రశ్నకు బిక్కమొహం వేసిన జగనన్న - YCP Social Media Activists
మైనింగ్ తవ్వకాల సౌమ్యుడు అప్పలనాయుడు: సౌమ్యులైన బడ్డుకొండ అప్పలనాయుడుపై జగన్‌కు ఉన్న అభిప్రాయం గురించి తెలుసుకుందాం. మైనింగ్ మాఫియాకు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చి భోగాపురం మండలంలో మైనింగ్ తవ్వకాల ద్వారా గ్రామాలను ధ్వంసం చేసి నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి కొండపై తవ్వకాలకు ఏర్పాట్లు చేసిన ప్రముఖులెవరో మీకెంతో నమ్మకస్తులైన అప్పలనాయుడికి తెలుసో లేదో అని జగన్ వైపు ఓటర్లు జాలిగా చూస్తున్నారు. భూఆక్రమణలు, ఇసుక దందాల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించే నాయకులెవరో కనుక్కుంటారా అని ప్రశ్నిస్తున్నారు.
వెన్నలాంటి మనసున్న చినఅప్పలనాయుడుకు ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు బెదిరించి తక్కువ ధరకు లాక్కునే నాయకుల సంగతి ఏమైనా తెలిసి ఉంటుందంటారా అని ఆ ఊరివారు అనుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా టెండరు వేసేది ఒక్క సంస్థేనట. అధికారాన్ని ఉపయోగించి లేఅవుట్లలో సామాజిక అవసరాల స్థలాన్నీ అమ్మేసుకుంటారంట. వాళ్లెవరో ఆయన్ను కనుక్కుని చెబుతారా అని జగన్‌ను అడుగుతున్నారు.
ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి శూన్యం: వైఎస్ షర్మిల - YS Sharmila Election Campaign
భూముల ఆక్రమణ, ఇసుక దోపిడీలో సౌమ్యులు గొర్లె కిరణ్: సౌమ్యులలో ఆరోవారు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ప్రభుత్వ భూముల ఆక్రమణ, ఇసుక దోపిడీ, రియల్ఎస్టేట్ దందాలు అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నాయి. లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాల్సిందేనట. కొండల్ని కరిగించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో సౌమ్యుడైన కిరణ్‌ను కనుక్కుంటారా సీఎం సర్ అని నియోజకవర్గ ఓటర్లు అడుగుతున్నారు. ప్రశాంత ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాలకు వేదికగా మార్చిన నాయకుడెవరో మెతక గుండె కలిగిన మీ మంచివాడికి తెలుసునేమో కనుక్కుని వివరిస్తారా జగన్ అని ఓటర్లు అంటున్నారు.
సౌమ్యుల్లో ఏడో వారు బెల్లాన చంద్రశేఖర్. చీపురుపల్లి మండలం దేవరాపొదిలాంలో తనకు ప్రభుత్వం కేటాయించిన 4.75 ఎకరాల మెట్ట భూమి కబ్జాకు గురైందని మాజీ సైనికుడు ఎస్.శ్రీనివాసరావు రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాసిన సంగతి మంచివాడైన చంద్రశేఖర్‌కు తెలుసోలేదో అనే అనుమానం జగన్‌కు రాలేదనుకుంటా. ఒక వేళ వస్తే ఆయనకు చెప్పి శ్రీనివాసరావుకు న్యాయం చేయవచ్చుగా? పోలీసు కేసులు, ప్రైవేటు వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేసే నేతలెవరో మద్యం సిండికేట్, అక్రమ మైనింగ్ తవ్వకాలకు కారకులెవరో కాస్త కనుక్కుంటారా జగన్ అని విజయనగరం ఓటర్లు అంటున్నారు.
ఈ బెజవాడ నీళ్లను సీఎం జగన్, భారతి రెడ్డి తాగుతారా?: కేశినేని శ్రీదేవి ఫైర్ - water issue in Bejawada