CM Jagan Neglects Visakha Steel Plant: ఆంధ్రుల హక్కుగా ప్రజల గుండెల్లో నిలిచిన విశాఖ ఉక్కును (Visakha Steel Plant) ఊచకోత కోసిన పాపం జగన్‌దే. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పి కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారు. ప్రైవేటీకరణకు అడుగులు వేసిన కేంద్ర నిర్ణయాల కంటే దారుణంగా ఉక్కు ఊపిరి జగనే తీశారు. 11 వందల రోజుల్లో ఒక్కసారీ జగన్ ఉద్యమానికి మద్దతు తెలపలేదు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోనేడు స్టీల్ ప్లాంట్‌లో తలపెట్టనున్న న్యాయసాధన బహిరంగ సభకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇవ్వగా ఉక్కు పరిరక్షణకు డిక్లరేషన్‌ను, రైల్వే జోన్ అంశంపైనా ప్రకటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
విశాఖ ఉక్కు భూములు విక్రయించారా? కొనుగోలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా?: హైకోర్టు
రాష్ట్ర ప్రజలకు 2 లక్షల 75 కోట్ల రూపాయలు ఇచ్చానని పదేపదే చెప్పే జగన్ విశాఖ ఉక్కుకు 2 వేల కోట్ల ఆర్థిక సాయం చేయకుండా ముఖం చాటేశారు. ఏటా 25 వేల కోట్ల టర్నోవర్ ఉన్న విశాఖ ఉక్కు నుంచి జీఎస్టీ రూపంలో రాష్ట్ర వాటాగా 2 వేల కోట్ల రూపాయలకుపైగా వస్తుంది. స్టీలు ప్లాంటు ఉద్యోగులు ఏటా అందుకునే 11 వందల కోట్ల రూపాయల జీతభత్యాలపైనా పన్నుల రూపంలో ఖజానాకు జమ అవుతున్నాయి. అయినా ''ఉచితంగా వద్దు అప్పుగా 500 కోట్ల చొప్పున 4 నెలలు ఆర్థిక సాయం చేసి ప్రతిగా ఉక్కు తీసుకెళ్లండి'' అంటూ ఉద్యోగ, కార్మికసంఘాల ప్రతినిధులు ఓ వినతి ఇచ్చారు. పేదలకు ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు తీసుకోవాలని కోరినా జగన్ కనికరం చూపలేదు. పైగా కంటితుడుపుగా ఓ అధికారి ఆధ్వర్యంలో కమిటీ వేసి సాధ్యాసాధ్యాలపై నివేదికలివ్వాలని చెప్పడం మరో మోసమే కదా అని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
జిందాల్‌తో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒప్పందం - వ్యతిరేకిస్తున్న కార్మికులు
ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ముందుకెళ్తుంటే దాన్ని ఆపేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తిరిగి తెరచాటున ఉక్కు పరిశ్రమ గొంతు కోసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే కేంద్రానికి ఎక్కడ కోపం వస్తుందోననే భయంతోనే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ప్రైవేటు స్టీల్ కర్మాగారాలకు అడిగిన వెంటనే ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన పాపాన పోలేదు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు లేక ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం తెచ్చుకుంటోంది.
విశాఖ ఉక్కు పోరాటానికి వెయ్యి రోజులు - ప్రభుత్వ స్పందన లేకపోవడంపై మండిపడుతున్న కార్మిక సంఘాలు