ETV Bharat / state

భైరవానితిప్ప ప్రాజెక్టుపై జగన్​ సర్కార్​ నిర్లక్ష్యం - అనంతవాసులకు తీరని ద్రోహం - Bhairavani Tippa Project - BHAIRAVANI TIPPA PROJECT

CM Jagan Neglect Bhairavani Tippa Project in Anantapuram District : బైరవానితిప్ప ప్రాజెక్టుకు నీరొస్తే బీడువారిన భూములు సస్యశ్యామలం అవుతాయని కలలు కన్న రైతుల ఆశలను వైఎస్సార్సీపీ సర్కారు నీరుగార్చింది. మాటల గారడీతో పదవీకాలం పూర్తి చేసింది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని బీటీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది.

bt_project
bt_project (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 3:04 PM IST

భైరవాని తిప్ప ప్రాజెక్టుపై జగన్​ సర్కార్​ నిర్లక్ష్యం - అనంతవాసులకు వైఎస్సార్సీపీ తీరని ద్రోహం (ETV Bharat)

CM Jagan Neglect Bhairavani Tippa Project in Anantapuram District : భైరవాని తిప్ప ప్రాజెక్టు సంబంధించిన భూ సేకరణ కార్యక్రమం యుద్ధప్రతిపాదికన జరుగుతుందని 2021 జులై 8న రాయదుర్గం నియోజవర్గంలో రైతు దినోత్సవ సభలో సీఎం జగన్​ ఊదరగొట్టారు. ప్రాజెక్ట్​ సంబంధించి 1400 ఎకరాలకు గాను 500 ఎకరాల భూసేకరణ పూర్తి అయ్యిందని రైతన్నలకు వివరించారు. మిగిలిన భూమిని కలెక్టర్​, ఇతర అధికారుల ద్వారా 60 రోజుల్లో సేకరించి ప్రాజెక్ట్​కు సంబంధించిన పనులను శర వేగంగా మొదలుపెడతామని జిల్లా వాసులను నమ్మించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే చెప్పడంతో తమ ప్రాంతానికి ఇంకా తాగునీరు, సాగునీటి సమస్య ఉండదని ప్రజలు ఆనందించారు. కానీ సీఎం జగన్​ వారి ఆశలపై నీళ్లు చల్లారు. జగన్​ సీఎం స్థాయిలో జిల్లాలో రెండు సార్లు పర్యటించినా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా భైరవాని తిప్ప ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. మాట తప్పాను, మడమ తిప్పాను అంటునే జిల్లా వాసులకు నమ్మించి నట్టేట ముంచారు.

అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం అత్యంత దుర్భిక్ష ప్రాంతం. తీవ్ర వర్షాభావంతో అక్కడి ప్రజలకు పంటలు లేక, ఉపాధి మార్గాలు కరవై ఉపాధి కోసం రైతులను, వ్యవసాయ కూలీలు ఏడాది పొడవునా వలసలు వెళ్లేవారు. వీరిని ఆదుకోవటానికి దాదాపు 50 ఏళ్ల క్రితం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలాలకు మధ్య గుమ్మగట్ట సమీపంలో వేదవతి నదిపై బైరవాని తిప్ప జలాశయాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రెండు నియోజకవర్గాల్లో దాదాపు 12,800 ఎకరాలకు సాగునీరు అందేది. బీటీ ప్రాజక్టు ఎగువన కర్ణాటక రాష్ట్రంలో అక్రమ ప్రాజక్ట్​లు నిర్మించటం వల్ల రెండున్నర దశాబ్దాలుగా జలాశయంలోకి నీటి చేరిక లేదు. దీంతో బీటీ ప్రాజక్టును మృత ప్రాజక్టుల జాబితాలో చేరిపోయింది.

చేనేత కార్మికుల పొట్టకొట్టిన జగన్​ సర్కార్​ - షరతులతో నేతన్న నేస్తానికి కోత - CM Jagan Neglect Handloom Workers

2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అక్కడి పరిస్థితులను చూసిన అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒప్పించి హంద్రీ నీవా కాలువ నుంచి కృష్ణా జలాలను బీటీ ప్రాజెక్టుకు తరలించే ప్రతిపాదనలకు కార్యరూపం తీసుకొచ్చారు. అప్పట్లో చంద్రబాబు సర్కారు రూ.968 కోట్లను మంజూరు చేసింది. ఓ వైపు కాలువ తవ్వకానికి భూసేకరణ, మరోవైపు కాలువ నిర్మాణ పనులు వేగంగా చేశారు. ఇంతలోనే 2019లో ఎన్నికలు రావడం, జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బైరవాని తిప్ప ప్రాజెక్ట్​కు గ్రహణం పట్టింది. కాలువ తవ్వడానికి భూములిచ్చిన రైతులకు పరిహారం ఇవ్వడంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలం కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీపై జగన్​ సర్కార్ నిర్లక్ష్యం​ - నిస్సహాయస్థితిలో అన్నదాతలు - Jagan Neglect Prakasam Barrage

"బీటీ ప్రాజెక్ట్​ కాలువ కింద మా భూములు పోయాయి. ఇంత వరకు ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. మా సమస్యలను పరిష్కరించమని కలెక్టర్​ చుట్టూ 5, 6 సార్లు తిరిగినా ఎలాంటి ఫలితం లేదు. జిల్లాలో మంత్రి ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు. కాలువను పూర్తి చేస్తామని చెప్పింది. కానీ ఇంత వరకు చేయలేదు" -రైతులు

జగన్​ హామీల డ్రామాలకు నిదర్శనం వరికపూడిశెల- పల్నాడు గడ్డకు వైఎస్సార్సీపీ తీరని ద్రోహం - Varikapudishela Project

టీడీపీ ప్రభుత్వ హయాంలో జీడిపల్లి జలాశయం నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, కుందర్పి, కంబదూరు మండలలాతో పాటు ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప, రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట ల మీదుగా 61 కిలోమీటర్ల కాలువ తవ్వి బీటీ ప్రాజక్టుకు నీటిని తరలించాలని పనులు ప్రారంభించారు. ఈ కాలువ పొడవునా ఏడు చోట్ల నీటిని ఎత్తిపోసి బీటీ ప్రాజక్టుకు కృష్ణా జలాలు తరలించే లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఈ కాలువ తవ్వడానికి 1408 ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయించి 102 ఎకరాలు సేకరించి, రైతులకు కోటిన్నర రూపాయల మేర పరిహారం చెల్లించారు. భూమి సేకరించిన మార్గంలో 18 కిలోమీటర్ల మేర కాలువ తవ్వడం పూర్తి చేశారు. ఇంతలోనే ఎన్నికలు రావడం ప్రభుత్వ మారిపోయింది. అప్పుడు తవ్విన కాలువల్లో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి తప్ప నీరు పారడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐదేళ్లుగా భూ సర్వే, డిజైన్లకే పరిమితం ​- జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు ఊసెత్తని జగన్ - Jeedipally Peruru Project

టీడీపీ అధికార పగ్గాలు కైవసం చేసుకొని భైరవానితిప్ప ప్రాజెక్ట్​ను పూర్తి చేయాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే తాము పంటలు పండించుకోవడానికి సాగునీరు సమస్య ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రాజధానుల పేరిట జగన్​ మూడు ముక్కలాట - బలైన భవన నిర్మాణ కార్మికులు - CM Jagan Neglect Labours

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.