Chandrababu Visit to Flood Affected Areas: ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తనతో సహా మంత్రులు, అధికారులు అంతా బురదలోనే తిరుగుతున్నారని చెప్పారు. బుడమేరకు గండ్లు పడినా గత పాలకులు పూడ్చకుండా పట్టించుకోని ఫలితమే ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చాయని ధ్వజమెత్తారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు కబేళా సెంటర్లో బాధితులతో మాట్లాడారు. బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని విమర్శించారు.
గత 9 రోజులుగా ప్రజలు పడిన బాధలు వర్ణనాతీతమని అన్నారు. ప్రభుత్వానికి ఎన్నో కష్టాలు ఉన్నాయని 10 లక్షల కోట్ల అప్పుచేసి జగన్ గద్దె దిగిపోయాడని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు వెనుకా కుట్ర ఉందని ఆరోపించారు. వచ్చి ఈ బురదలో జగన్ తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతైనా పోయేవని కానీ బెంగుళూరులో కూర్చుని తమపై బురద చల్లుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మహా యజ్ఞంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
గత పాలకుల పాపాలే ప్రజలకు శాపంగా మారాయి: వరద తీవ్రత వల్ల అందరికీ పూర్తి స్థాయిలో సహాయం చేయలేకపోయామని బాధితులతో చంద్రబాబు అన్నారు. నష్టపోయిన అందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేసి తీరుతామని స్పష్టం చేశారు. 9 రోజులుగా నీటిలోనే ఉన్న వారి బాధ, ఆవేదన అర్ధం చేసుకోగలనని తెలిపారు. నష్టం అంచనా మొదలుపెట్టామన్న చంద్రబాబు త్వరలోనే అందరి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. భవానీపురం, స్వాతీ థియేటర్, ఊర్మిళా నగర్ ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. బాధితుల్ని పరామర్శించి వారి కష్టాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. గత పాలకుల పాపాలే ప్రజలకు శాపంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరును పట్టించుకోకనే ఈ దుస్థితి తలెత్తిందన్నారు. బాధితులను ఆదుకోకపోగా ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేతలు బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
"శభాష్ రామానాయుడు"- వరద నియంత్రణ చర్యలపై చంద్రబాబు ప్రత్యేక అభినందనలు - CBN CONGRATULATED NIMMALA
బుడమేరుకు జరిగిన అక్రమాల వల్లే ఇన్ని కష్టాలు: ఎన్నికల ముందు గులకరాయి డ్రామా ఆడిన జగన్, సింగ్ నగర్లోని అమాయకుల్ని జైల్లో పెట్టించాడని సీఎం మండిపడ్డారు. ఎన్నికల తర్వాత మళ్లీ బురద రాజకీయాలు చేసేందుకే జగన్ సింగ్ నగర్ వచ్చాడని ఆరోపించారు. ప్రజల్ని కాపాడి ఆదుకోవటమే ఏకైక ధ్యేయంగా తామ పని చేస్తున్నామని సీఎం సష్టం చేశారు. వరద ముంపు వల్ల సింగ్ నగర్ ప్రజల బాధలు వర్ణతాతీతమని అన్నారు. తమ మంత్రి నిద్రాహారాలు మాని బుడమేరు గండ్లు పూడ్చితే మరో మంత్రి నారాయణ సింగ్ నగర్ కష్టాలు తీర్చటమే లక్ష్యంగా రాత్రి పగలు కృషి చేశారన్నారు. దుర్మార్గుడి పాలనలో బుడమేరుకు జరిగిన అక్రమాల వల్లే ఇన్ని కష్టాలని ఆరోపించారు. సర్వసం కోల్పోయిన వారికి రేపు ఒక జత దుస్తులు అందిస్తామని చంద్రబాబు తెలిపారు.