ETV Bharat / state

విద్యుత్​శాఖపై రూ. 1.20 లక్షల కోట్ల రుణభారం - వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరే కారణమన్న అధికారులు - Chandrababu Review on Power Sector - CHANDRABABU REVIEW ON POWER SECTOR

Chandrababu on Energy Department : రాష్ట్రంలో విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎన్నడూ లేనంతగా ఐదేళ్లలో రుణభారం రూ. 1.20 లక్షల కోట్లకు చేరడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై అధికారులతో ఆయన చర్చించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలే కారణమని వారు చంద్రబాబుకు వివరించారు.

Chandrababu Review on Power Sector
Chandrababu Review on Power Sector (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 9:36 AM IST

Chandrababu Review on Power Sector : జగన్‌ అప్పుల థియరీ ఇంధన శాఖను నిండా ముంచింది. గత వైఎస్సార్సీపీ సర్కార్ ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా సంస్థ అప్పులను రూ. 1.20 లక్షల కోట్లకు పెంచింది. ఈ పరిస్థితి నెలకొనడానికి దారితీసిన కారణాలపై సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు.

అప్పటి సర్కార్ స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా ఐదు సంవత్సరాల వ్యవధిలో బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసిన కరెంట్ ఎంత? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సంస్థపై అప్పుల భారం పెరగడానికి కారణాలేంటి తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంధన శాఖపై ఈ నెల 8న శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా సంస్థ ఆర్థిక అంశాలపై సమీక్షించారు.

ప్రజలపై రూ.18,000ల కోట్ల భారం వేసినా : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్‌ సంస్థ నిర్వహణ కోసం రూ. 53,560 కోట్లు అప్పులు చేసింది. అంతకుముందు శ్లాబ్‌ల మార్పు టారిఫ్‌ల సవరణ, ట్రూఅప్‌ పేరిట ప్రజలపై సుమారు రూ. 18,817 కోట్ల ఛార్జీల భారాన్ని మోపింది. ఆ తర్వాత కూడా నిర్వహణ కోసం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

సంక్షేమ పథకాల అమలులో భాగంగా వివిధ వర్గాలకు ఉచితంగా అందించిన కరెంట్​కు సంబంధించిన రాయితీ రూ. 15,036 కోట్లు చెల్లించకపోగా, ప్రభుత్వ శాఖలు రూ. 15,795 కోట్ల మొత్తం విద్యుత్‌ బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాటితో పాటు ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రూ.2,000 కోట్లు అప్పుగా ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వానికి విద్యుత్‌ సుంకం కింద రూ.3,100 కోట్లు ముందస్తుగా చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Chandrababu on Energy Department : ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయడానికి అప్పులు తీసుకోక తప్పలేదని అధికారులు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి రూ. 17,137 కోట్ల ట్రూఅప్‌ ప్రతిపాదనలు ఉన్నాయని, అవి వసూలు కావాల్సి ఉందని ముఖ్యమంత్రికి తెలిపినట్లు తెలిసింది. తీసుకున్న రుణాలపై వడ్డీ రూపేణా ఏటా సుమారు రూ. 6,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందని అధికారులు అన్నారు.

థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని నిలిపివేయడంతో : కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని గత సర్కార్ జాప్యం చేసిన కారణంగా ప్రజలపై సుమారు రూ.15,000ల కోట్ల విద్యుత్‌ ఛార్జీల భారం వేయాల్సి వచ్చిందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. అయితే 2019 నాటికి సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయయని, అప్పటి సర్కార్ వాటిని పట్టించుకోలేదని వెల్లడించారు. దీంతోపాటు థర్మల్‌ యూనిట్లను ఉత్పత్తిలోకి తేవడంలో రెండేళ్ల జాప్యం వల్ల ఇంట్రస్ట్‌ డ్యూరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఐడీసీ) కింద రూ.10,000ల కోట్ల భారం ప్రజలపై పడనుందని తెలిపారు. అదేవిధంగా సంస్థ ఆర్థిక అంశాలకు సంబంధించి మరికొన్ని విషయాలను కూడా వివరించినట్లు తెలిసింది. ఈ నెల 4న సీఎం దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విద్యుత్‌ శాఖపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.

అధికారుల తప్పిదం - ధరల భారాన్ని ప్రజలే భరించాల్సిన దుస్థితి - burden on electricity consumers

విద్యుత్​ బిల్లు చూస్తే దడ - కట్టలేక వణికిపోతున్న జనం - Electricity Bill Hike in YCP Govt

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.