ETV Bharat / state

'ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలి' -'దేవాదాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష - CM Chandrababu Review

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 8:23 AM IST

CM Chandrababu Review on Endowment Department in AP : రాష్ట్రంలో ఎక్కడా బలవంతపు మతమార్పిళ్లు ఉండకూడదని సీఎం చంద్రబాబు సృష్టం చేశారు. ఇకపై ప్రసాదం, అన్నదానంలో నాణ్యత లేకపోతే సహించేది లేదని అధికారులకు సూచించారు. ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని తెలిపారు. భక్తుల మనోభావాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని దేవాదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

cm_review_endoment
cm_review_endoment (ETV Bharat)

CM Chandrababu Review on Endowment Department in AP : దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని, అపచారాలకు చోటు ఉండకూడదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. బలవంతపు మత మార్పిడులు ఆగాలన్నారు. భక్తుల మనోభావాలు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దేవదాయశాఖపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటుతో పాటు దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.

బలవంతపు మత మార్పిడులు ఉండకూడదు : భక్తులు ప్రశాంతత కోసం, తమ బాధలు దేవుడితో చెప్పుకునేందుకు ఆలయాలకు వస్తారని అలాంటి వారికి మంచి దర్శనం, చక్కటి వాతారణం కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏ కుటుంబమైనా పుణ్యక్షేత్రానికి వస్తే ఒకటి రెండు రోజులు అక్కడ ఉండే వాతావరణం కల్పించాలన్నారు. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలని ఆలయ అధికారులకు సూచనలు చేశారు. పటిష్ఠమైన చర్యల ద్వారా బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని చెప్పారు.

87 వేల ఎకరాల ఆలయాల భూములు అన్యాక్రాంతం - చోద్యం చూసిన జగన్​ సర్కార్​ - Endowment Lands Controversy in AP

టెంపుల్ టూరిజానికి ప్రణాళికలు : భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. సులభతర దర్శనం, దేవాలయాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలు, బస చేయడానికి అనువైన కాటేజ్​లు, గదులు ఉండాలన్నారు. భక్తుల జేబులు ఖాళీ చేసే విధంగా కాకుండా, భక్తులు ఇష్టంగా అక్కడ గడిపే పరిస్థితి కల్పించాలని ఆలయ అధికారులకు సూచించారు. టెంపుల్ టూరిజానికి (Temple Tourism) మన దగ్గర అనేక అవకాశాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో రావాలని సీఎం సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు కు నిర్ణయం తీసుకున్నారు.

జగన్‌ చట్టంతో దేవుడి భూములూ గోవిందా - ఆక్రమిస్తే ఆ పైవాడూ కాపాడలేడు! - NO SAFETY FOR ENDOWMENT LANDS

అదనంగా మరో ఇద్దరు : దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో అదనంగా మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఆలయ ఆదాయం రూ. 20 కోట్లు కంటే అధికంగా ఉంటే 15 మంది బోర్డు సభ్యులుగా ఉంటారు. దీన్ని 17కు పెంచనున్నారు. ఇలా అన్ని ట్రస్ట్ బోర్డుల్లో ఇద్దరు చొప్పున అదనంగా సభ్యుల సంఖ్యను పెంచనున్నారు. ట్రస్ట్ బోర్డులో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయీ బ్రాహ్మణుడు తప్పకుండా ఉండేలా చూస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు సభ్యుల సంఖ్యను పెంచి వారికి అవకాశం కల్పించనున్నారు.

అర్చకుల వేతనాలు పెంపు : అర్చకుల వేతనాన్ని రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు చంద్రబాబు పెంచారు. ఈ నిర్ణయం ద్వారా 1683 మంది లబ్ధి పొందనున్నారు. దీని వల్ల ప్రభుత్వం పై ఏటా 10 కోట్ల రూపాయల భారం పడనుంది. దూపదీప నైవేద్యాలకు దేవాలయాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఏడాదికి రూ. 32 కోట్ల అదనపు భారం పడనుంది. వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ. 3 వేలు భృతి ఇవ్వాలని సీఎం సూచించారు. నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్యవైశ్య సంఘాల కోరిక మేరకు వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును దేవాదాయ శాఖపరంగా గుర్తించి నిర్వహించేందుకు చంద్రబాబు నిర్ణయించారు.

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే చట్టం - సవరణ చేయనున్న కూటమి ప్రభుత్వం - Common Universities Act in AP

శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే పనులపై చర్చ : సీజీఎఫ్, శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా గత ప్రభుత్వం కొన్ని పనులను ప్రతిపాదించిందని చంద్రబాబు గుర్తు చేశారు. వాటిలో కొన్ని పట్టాలెక్కగా కొన్ని పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికే మొదలైన పనులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రారంభం కాని పనులను నిలిపేసి మరోసారి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. సీజీఎఫ్ క్రింద 243 పనులు టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన 1797 దేవాలయాల పనులు ప్రారంభం కాలేదు. వీటిని నిలిపేయాలని సీఎం నిర్దేశించారు. శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే దేవాలయాలు, ఇతర నిర్మాణాలపై చర్చించి అవసరమైతే వాటికి కేటాయించే నిధులు పెంచి పనులు ప్రారంభించాలని సూచించారు.

మళ్లీ గోదావరీ, కృష్ణా నదీ హారతులు : గతంలో పల్లెల్లో, వాడల్లో శ్రీవాణి ఆలయ నిర్మాణం ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చేవారని ఆలయ అధికారులు అభిప్రాయపడ్డారు. వీటితో ఆలయాల నిర్మాణాలు సాధ్యం కావడం లేదని అధికారులు వివరించారు. ఈ మొత్తాన్ని పెంచడానికి, రెట్టింపు చేసి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలోనూ దేవాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరీ, కృష్ణా నదీ హారతులు మళ్లీ నిర్వహించాలన్నారు.

వైఎస్సార్సీపీ అనాలోచిత నిర్ణయం - పూర్తి కాని జాతీయ విశ్వవిద్యాలయాల నిర్మాణాలు - National Institutes in ap

భక్తులకు ఆన్​లైన్​ సర్వీసులు : ప్రతి దేవాలయంలో ఆన్​లైన్ విధానం అమలు చేయాలని, అన్ని సర్వీసులు ఆన్​లైన్ ద్వారా అందాలని సీఎం స్పష్టం చేశారు. గుడికి వచ్చే భక్తులు దర్శనం చేసుకుని వెళ్లడమే కాకుండా ప్రత్యేక పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. అవసరమైతే ప్రైవేటు సెక్టార్ భాగస్వామ్యంతో హోటళ్ల నిర్మాణం చేపట్టి భక్తులకు వసతులు కల్పించాలని సీఎం అన్నారు. ధనికులే కాకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా బస చేసే పరిస్థితి ఉండాలని నిర్దేశించారు. గతంలో దేవాలయాల్లో జరిగిన పలు ఘటనలపై లోతుగా విచారణ జరపాలని ఆదేశించారు.

విద్యుత్​ బిల్లు తగ్గాలా ! 'సోలార్​ రూఫ్​టాప్' అమర్చుకోండి - Solar Rooftop in Kurnool

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.