ETV Bharat / state

దటీజ్ చంద్రబాబు - అర్ధరాత్రి బోటులో పర్యటించి బాధితులకు భరోసా - Chandrababu Visit Vijayawada - CHANDRABABU VISIT VIJAYAWADA

Chandrababu Visit Vijayawada : విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితులను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బోటులో వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు. సింగ్‌నగర్, కృష్ణలంకలో పర్యటించి వరద బాధితుల కష్టాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ అధైర్య పడొద్దని వారికి హామీ ఇచ్చారు.

Chandrababu Visit Vijayawada
Chandrababu Visit Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 8:52 AM IST

బోటులో వెళ్లి బాధితుల కష్టాలు తెలుసుకున్న చంద్రబాబు (ETV Bharat)

Chandrababu Inspected Vijayawada Flood Areas : బుడమేరు వరద ప్రభావంతో విజయవాడ నీటమునిగింది. సింగ్‌నగర్‌లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సింగ్‌నగర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు భరోసా కల్పించారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. చిమ్మచీకట్లో అరగంటకుపైగా బోటులో పర్యటించారు. సెల్‌ఫోన్లు, వీడియో కెమెరా లైట్ల వెలుతురులో ఆ ప్రాంతంలో తిరిగారు. బాధితుల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం : వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తలెత్తే ఇబ్బందులను వారికి చంద్రబాబు వివరించారు. కొద్ది గంటల్లోనే వ్యవస్థను చక్కదిద్దితానని హామీ ఇచ్చారు. విజయవాడలో ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదన్నారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా ముంపు ప్రాంతాల్లో పర్యటించినట్లు చెప్పారు. సమయం కొంచెం ముందు వెనుక అయినా వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని స్పష్టం చేశారు. తాను ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తానని తెలిపారు. సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ పనిచేస్తామని చంద్రబాబు భరోసా కల్పించారు.

"చాలా మంది బాధల్లో ఉన్నారు. వరద తగ్గిందని అంటున్నారు. బాధితులకు ఆహారం అందిస్తున్నాం. నేనే స్వయంగా కొందరికి ఆహారం, నీరు అందించా. వారిలో ధైర్యం వచ్చింది. అధికారులతో సమన్వయం చేసుకొని బొట్ల సహాయంతో ఆహార పదార్థాలు పంపిణీ చేస్తాం. కొందరు ఇళ్లలో ఉండిపోతే, మరికొందరు బయటినుంచి ఇళ్లకు వెళ్లలేక ఆందోళన చెందుతున్నారు. హుద్‌హుద్‌ విలయానికి, నేటి విపత్తుకు వేర్వేరు పరిస్థితులు. ఇక్కడ నీరు సమస్యగా ఉంది. బోట్లలో వెళ్లి కొన్ని ఇళ్లే చూడగలుగుతున్నాం. అందరినీ బయటకు తీసుకొస్తాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

Vijayawada Floods Updates : ముంపు ప్రాంతాల్లో పర్యటన తర్వాత చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌ వెళ్లి నగరంలో పరిస్థితిని మరోసారి సమీక్షించారు. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంటకు ఆయన కృష్ణలంక ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. రక్షణగోడకు సమాంతరంగా ప్రవహిస్తున్న పదిన్నర లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటాయని పేర్కొన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. విజయవాడ కృష్ణలంకలో ముంపు ప్రాంతాల పర్యటన తర్వాత ఇబ్రహీంపట్నం వెళ్లారు. అక్కడ వరద ఉధృతిని చంద్రబాబు స్వయంగా పరిశీలించారు.

సాధారణ పరిస్థితి వచ్చే వరకూ ఎన్టీఆర్​ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉంటా:చంద్రబాబు - Chandrababu Inspected Flood Areas

కుండపోత వర్షంతో కృష్ణా జిల్లా గజగజ - చెరువులను తలపిస్తోన్న పంటపొలాలు - Heavy Rains in Krishna District

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.