CM Chandrababu met with PM Modi: దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన బిజిబిజీగా సాగుతోంది. కాసేపటి క్రితం ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అంశాలపై ఇరువురు చర్చించారు. అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కేంద్రం సహకారాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరే అవకాశం ఉంది. నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం రాత్రి 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం సమావేశం అవుతారు.
రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటు: సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రామ్మోహన్ నాయుడు ఆహ్వానం మేరకు ఆయన కార్యాలయానికి వెళ్లారు. ఏపీలో విమానయానరంగ ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటు, వచ్చిన ప్రతిపాదనలపై కేంద్ర పౌరవిమానయానశాఖ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు.
పోలవరం కొత్త డయాఫ్రం వాల్‌కు గ్రీన్‌సిగ్నల్ - మేఘాకే నిర్మాణ పనులు! - CM Chandrababu Delhi Tour