ETV Bharat / state

టీడీపీ నేత ఓటర్​ రామకృష్ణ మృతి - చంద్రబాబు, లోకేశ్ సంతాపం - chandrababu lokesh condolences

CM Chandrababu and Nara Lokesh Condolences: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నె రామకృష్ణ మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. టీడీపీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ ఎంతో క్రియాశీలకంగా, సమర్థవంతంగా పని చేశారని కొనియాడారు. మరోవైపు కర్నూలు ఆ పార్టీ సీనియర్ నాయకులు బొల్లెద్దుల రామకృష్ణ తెల్లవారుజామున గుండె పోటుతో మరణించారు.

CM Chandrababu and Nara Lokesh Condolences
CM Chandrababu and Nara Lokesh Condolences (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 3:38 PM IST

CM Chandrababu and Nara Lokesh Condolences : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నె రామకృష్ణ మృతి (Anne Ramakrishna Passed Away) పట్ల సీఎం నారా చంద్రబాబు నారా, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ (X)లో పోస్ట్‌ చేశారు.

ఎంతో క్రియాశీలకంగా, సమర్థవంతంగా పని చేశారు : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నె రామకృష్ణ మృతి చెందారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. రామకృష్ణ హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ ఎంతో క్రియాశీలకంగా, సమర్థవంతంగా పని చేశారని కొనియాడారు. ఓటర్ వెరిఫికేషన్​లో మంచి అనుభవం ఉన్న రామకృష్ణను అంతా ఓటర్ రామకృష్ణగా పిలిచేవారని గుర్తు చేశారు. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అన్నె రామకృష్ణకు అశ్రునివాళులు : తెలుగుదేశం పార్టీ నేత, ఓటర్ అన్నె రామకృష్ణగా అందరికి సుపరిచితులైన అన్నే రామకృష్ణ అన్న హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఓటర్ రామకృష్ణకు అశ్రునివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఓటర్ రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

దళిత చైతన్య యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం : కర్నూలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొల్లెద్దుల రామకృష్ణ తెల్లవారుజామున గుండె పోటుతో మరణించారు. కర్నూలులోని 52వ వార్డుకు చెందిన బొల్లెద్దుల రామకృష్ణ మంత్రి టీజీ భరత్ విజయానికి దళిత చైతన్య యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీజీ భరత్ విజయానికి కృషి చేశారు. రామకృష్ణ మృతదేహానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు పూలలు వేసి నివాళులు అర్పించారు. బొల్లెద్దుల రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.