CM Chandrababu Tweet On 6 Months Of NDA Alliance Governance : ఆరు నెలల పాలనపై సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన గత ఐదేళ్ల కాలాన్ని ప్రజలు ఒక పీడకలగా భావించారని, సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి… pic.twitter.com/hgt0hmonU4
— N Chandrababu Naidu (@ncbn) December 12, 2024
తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు తాను, తన మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఆరు నెలల్లో గాడితప్పిన వ్యవస్థల్ని సరిదిద్దామని పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టామన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టామని తెలిపారు. 'రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నామన్నారు. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తించుకొని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజల ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర - 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్‌గా నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు.
పల్లెప్రగతి పనుల్లో జాప్యంపై సీఎం ఆగ్రహం - ఆ చిన్నారులకు పింఛన్ ఇవ్వాలని ఆదేశాలు
రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయ్యింది. ఐదేళ్లలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయి. సంక్షోభాలను అవకాశాలుగా తీసుకొని సంక్షేమంగా మలిచే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచీ రాష్ట్ర పునర్నిర్మాణం… pic.twitter.com/s1DDvtiPeo
— Lokesh Nara (@naralokesh) December 12, 2024
Lokesh on Six Months of Rule in AP : రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయ్యిందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఐదేళ్లలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయని విమర్శించారు. సంక్షోభాలను అవకాశాలుగా తీసుకొని సంక్షేమంగా మలిచే చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పని చేస్తోందని తెలిపారు. పిచ్చిపిచ్చి రంగులు ఉండవు.. తమ బొమ్మలు కనిపించవు.. పబ్లిసిటీ కంటే రియాలిటీకే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. 'రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' అనే నినాదం కూటమి ప్రభుత్వ విధానంగా అమలు చేస్తూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు. అందరి సహకారంతో స్వర్ణాంధ్ర - 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
6 Months of Kutami Govt : 6 నెలల ఎన్టీయే కూటమి ప్రభుత్వం హ్యాష్ టాగ్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంది. రాష్ట్రంలో ఎన్టీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన సందర్భంగా పెట్టిన హ్యాష్ ట్యాగ్‌కు అత్యధిక పోస్ట్ లు వచ్చాయి. ఎక్స్ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో "6monthsofkutamigovt" హ్యాష్ టాగ్ కొనసాగుతోంది.
ప్రజలకు జవాబివ్వడంలో నిర్లక్ష్యం వద్దు - మానవత్వంతో సమస్యల్ని పరిష్కరించాలి: చంద్రబాబు