ETV Bharat / state

కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటన- వినతులు ఇచ్చేందుకు పోటెత్తిన ప్రజలు - Chandrababu Visit To Kuppam - CHANDRABABU VISIT TO KUPPAM

CM Chandrababu 2nd Day Visit To Kuppam: సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన్ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు ఎక్స్​లో అభినందనలు తెలుపుతూ పోస్ట్​ చేశారు.

CM Chandrababu 2nd Day Visit To Kuppam
CM Chandrababu 2nd Day Visit To Kuppam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 2:13 PM IST

Updated : Jun 26, 2024, 2:56 PM IST

CM Chandrababu 2nd Day Visit To Kuppam: ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నియోజవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం వద్ద సీఎం చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కుప్పం డిగ్రీ కళాశాలకు వెళ్లిన చంద్రబాబు నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. తర్వాత పీఈఎస్‌ ఆడిటోరియానికి వెళ్లనున్న చంద్రబాబు అక్కడ తెలుగుదేశం నాయకులు, ప్రధాన కార్యకర్తలతో భేటీ అవుతారు.

కాన్వాయ్‌లు, సైరన్‌ల వంటి ఆడంబరాలు వద్దు - మంత్రులకు చంద్రబాబు సూచనలు - CBN Instructions to Ministers

Chandrababu Wishes To Speaker OM Birla in Twitter: 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్​లో పోస్ట్​ చేశారు. ఓం బిర్లా విజ్ఞతతో సభను నడిపించి, పార్లమెంటరీ సంప్రదాయాలను నిలబెట్టాలని కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు. సభను నడిపించడంలో ఓం బిర్లా విజయం సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Last Updated : Jun 26, 2024, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.