Nadendla on Illegal Transportation of PDS Rice : పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసేవారికి 6 నెలల కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 104 గోదాములో తనిఖీలు చేస్తున్నామని ఎక్కడ స్టాక్ ఎంత ఉందనే అంశాలపై విచారణ చేస్తున్నామని మంత్రి చెప్పారు. అందులో మచిలీపట్నంలోని జేఎస్, సత్య గోదాముల్లో ఉన్న స్టాక్లలో తేడాలున్నట్లు గుర్తించామని తెలిపారు. మొత్తం 243 మెట్రిక్ టన్నుల బియ్యం దారి మళ్లించారని మంత్రి మనోహర్ చెప్పారు.
కూటమి ప్రభుత్వం పౌరసరఫరాల శాఖలో మార్పు కోసం నిక్కచ్చిగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ఎవరూ ఊహించని రీతిలో అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. రూ.1.70 కోట్ల పైగా డీడీలు ఇచ్చారని అవి ఇచ్చిన మాత్రాన కేసు విచారణ ఆగదని అన్నారు. పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు కలిపి సంయుక్తంగా విచారణ చేస్తున్నాని తెలిపారు. ఈ కేసులో కచ్చితంగా ముగింపు ఉంటుందని క్షేత్రస్థాయిలో నిజాలు తెలుసుకుని దర్యాప్తు చేపట్టామని మంత్రి మనోహర్ చెప్పారు.
బ్లాక్ లిస్టులోకి పేర్ని నాని గోడౌన్! - రేషన్ బియ్యం మచిలీపట్నం తరలింపు
ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు. కానీ తప్పు చేసినవారు చట్టం చేతుల్లోంచి తప్పించుకోలేరు. గత ప్రభుత్వ నేతలు వ్యవస్థలను ఎంతగా ఖూనీ చేశారో ప్రజలు గ్రహించాలి. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవు కాని మేం మాత్రం నిజాయతీగా పనిచేస్తాం. వ్యక్తులను కాదు వ్యవస్థలను ప్రక్షాళన చేసే దిశగా మా చర్యలు ఉంటాయి. వే బ్రిడ్జ్‌నే ట్యాంపర్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాకినాడ పోర్టు రేషన్ బియ్యం కేసును కొలిక్కి తెస్తాం. - నాదెండ్ల మనోహర్, మంత్రి
సక్రమంగా జరిగే ఎగుమతులను ప్రభుత్వం అడ్డుకోదు: కాకినాడ పోర్టు కేంద్రంగా సక్రమంగా జరిగే ఎగుమతులు, వాణిజ్యానికి కూటమి ప్రభుత్వం అడ్డుకోదని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గతంలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే పీడీఎస్ బియ్యం అక్రమాలు పెద్ద ఎత్తున జరిగేవని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వివాదం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి సబ్సీడీ బియ్యాన్ని అందిస్తోందని అయితే కొందరు అక్రమార్కులు దీన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.
అమరావతిపై తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు - టీడీపీ ఆగ్రహం
పర్యాటకులను ఆకర్షిస్తున్న రింగ్ రోడ్డు అడవి! - రోజుకు 10 వేల మంది సందర్శన