ETV Bharat / state

నీటి హక్కులు కాపాడుకోకపోతే విపత్కర పరిస్థితులను తప్పవు : ప్రజా సంఘాల ఆందోళన - AP Water Rights - AP WATER RIGHTS

Civil Society Leaders Released a Book on AP Water Rights : నీటి హక్కులను కాపాడుకోకపోతే రాష్ట్రం విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. విజయవాడ దాసరి భవన్​లో రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు నాలుగో వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా "కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ - కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Civil Society Leaders Released a Book on AP Water Rights
Civil Society Leaders Released a Book on AP Water Rights (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 7:45 PM IST

Civil Society Leaders Released a Book on AP Water Rights : రాష్ట్ర నీటి హక్కులు కాపాడుకోకపోతే ఏపీ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు, ప్రజా సంఘాల నాయుకులు అభిప్రాయపడ్డారు. విజయవాడలోని దాసరి భవన్‌లో రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు నాలుగో వర్ధంతి నిర్వహించారు. "కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ - కొత్త ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్లు" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత టి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నీటి సమస్యను 5 కోట్ల ప్రజల సమస్యగా చూడాలన్నారు. కృష్ణా నదీ జలాల వివాదంపై బచావత్ ట్రిబ్యునల్ నివేదిక అమలు విషయంలో జాప్యం జరుగుతుందన్నారు. విభజన తరువాత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రెండు రాష్ట్రాలు పాటించాలని చట్టంలో ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నాయని గుర్తుచేశారు. వీటిని త్వరగా గతిన పూర్తి చేసి నీటి కేటాయింపులు చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్​కు కేంద్రం బాధ్యత అప్పగించిందని తెలిపారు. వచ్చేది ఏ ప్రభుత్వం అయినా సరే నీటి హక్కులపై పోరాటం చేయాలని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

గోదావరి పరివాహకమైనా కరవు సీమే- అధ్వానంగా ఉద్యాన రైతుల పరిస్థితి - Irrigation Problems to Farmers

తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలు వాదనలు చేస్తోంది : నీటి హక్కులను కాపాడుకోకపోతే రాష్ట్రం విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వర రావు తెలిపారు. నీటి కేటాయింపులపై తెలంగాణ సర్కార్ అడ్డగోలు వాదన చేస్తోందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డికి అనుమతి లేకపోయిన తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేస్తోందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం నీటి కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం వితండవాదం చేస్తుందన్నారు. ఉద్యోగం కోసం మన రాష్ట్రానికి వచ్చిన సర్ ఆర్థర్ కాటన్ ఇక్కడి ప్రజలు ఇబ్బందులు చూసి సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సాగు నీటి రంగానికి ప్రాధాన్యత తగ్గిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, రైతు సంఘాలతో సంబంధం లేకుండా కేంద్రంలో చట్టాలు చేసేస్తున్నారని వడ్డేశోభనాదీశ్వరరావు విమర్శించారు.

ప్రకాశం బ్యారేజీపై జగన్​ సర్కార్ నిర్లక్ష్యం​ - నిస్సహాయస్థితిలో అన్నదాతలు - Jagan Neglect Prakasam Barrage

నీటి హక్కులు కాపాడుకోకపోతే ఏపీ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది : ప్రజా సంఘాల నాయకులు (ETV Bharat)

నీటి పంపకాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం : మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే నీటిపారుదలపై నియంత్రణ చేస్తుందని దీని వల్ల రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నీటి హక్కులను కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీటితో వ్యాపారం చేయడం వల్ల రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్టీఆర్ హయంలో ప్రాజెక్టుల నీటిని చెరువులకు అనుసంధానం చేయడంతో నిల్వ చేసుకునే అవకాశం వుండేదని ఇప్పుడు అలా లేదన్నారు. అలాగే నీటి పంపకాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చిన తరువాత నీటి పంపకాలు మారతాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా పెండింగ్‌ ప్రాజెక్టులను కేంద్రం పూర్తి చేయాలని రామకృష్ణ కోరారు.

ఐదేళ్లలో నీటి ఎద్దడిపై ప్రభుత్వం ఒక్కసారి సమీక్ష నిర్వహించలేదు: లోకేశ్ - Nara Lokesh Letter to Collector

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.