ETV Bharat / state

టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మరింత లోతుగా విచారణ - సీఐడీ దర్యాప్తునకు అవకాశం - CID Inquiry Into TDR Bonds Scam - CID INQUIRY INTO TDR BONDS SCAM

CID Inquiry Into TDR Bonds Scam : టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. సీఐడీ విచారణతోనే సూత్రధారులు వెలుగులోకి వస్తారని భావిస్తోంది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరిపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో న్యాయనిపుణులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

TDR Bonds Scam
TDR Bonds Scam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 3:40 PM IST

CID Inquiry Into TDR Bonds Scam : టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మరింత లోతుగా ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. ఈ అంశాన్ని మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. సీఐడీ విచారణకు ఇస్తేనే అసలు సూత్రధారులు ఎవరన్న అంశం వెలుగులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరిపై ఆరోపణలు ఉన్నాయి. తణుకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిన తీరును మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుకు వివరించారు.

ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో ప్రభుత్వం న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తుంది. తణుకు మున్సిపాలిటీలో 754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్టు పురపాలక శాఖ, అవినీతి నిరోధక శాఖలు గుర్తించాయి. మొత్తం 691 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్థల సేకరణ సయయంలో ఎకరాల్లో గుర్తించి బాండ్ల జారీకి చదరపు గజాల్లో స్థలం లెక్కించినట్టు ప్రభుత్వం గుర్తించింది.

ఎకరా 55 లక్షలకు సేకరించి బాండ్ల జారీకి ఎకరా 10 కోట్లు విలువ చూపడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గుర్ని సస్పెండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2019-24 మధ్య కాలంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేస్తుంది.

టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ - సీఐడీ దర్యాప్తునకు యోచన - TDR Bonds Scam in AP

మరోవైపు టీడీపీ బాండ్లపై త్వరలోనే కొత్త మార్గదర్శకాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్రాల్లో అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో టీడీపీ బాండ్ల జారీలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. వైఎస్సార్సీపీ నేతలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అందుకే బాండ్ల జారీలో అవినీతికి ఆస్కారం లేని ఉత్తమ విధానాలపై దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, తెలంగాణ, హరియాణాలలో అధికారులు పర్యటించి అధ్యయనం చేస్తున్నారు.

దీంతో పాటు కొత్త ఇళ్లు, భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇచ్చే విధానాన్ని విధిగా అమలు చేయనున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆన్‌లైన్‌ విధానాన్ని అక్రమ వసూళ్లకు వేదికగా మార్చేశారు. దీంతో అనుమతులను కూటమి ప్రభుత్వం సరళీకృతం చేయాలని చూస్తోంది.

అక్రమాలకు ముకుతాడు - టీడీఆర్ బాండ్లపై త్వరలోనే కొత్త మార్గదర్శకాలు - TDR Bonds New Guidelines in AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.