Chittoor MLA Arani Srinivasulu: గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్సార్సీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని చిత్తూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బలిజ కులానికి చెందిన తాను, వైఎస్సార్సీపీలో అనేక ఇబ్బందులు పడ్డానని తెలిపారు. బలిజ కులస్థులకు వైఎస్సార్సీపీలో జరుగుతున్న వివక్షను చూసి విసిగిపోయానన్నారు. అందుకే వైఎస్సార్సీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ కోసం కష్టపడి పనిచేశా: గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రకటించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ కోసం అంకిత భావంతో పని చేసినట్లు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా, చిత్తూరును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కోసం కష్టపడి పని చేశానని తెలిపారు. 2024 ఎన్నికల్లో చిత్తూరు టికెట్ ఇస్తానని చెప్పి, సీఏం జగన్ మోసం చేశారని ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కష్టపడ్డానని, అయినా తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోగా, రాజ్యసభకు పంపిస్తామని చెప్పి వైఎస్సార్సీపీ పెద్దలు మరోమారు మోసం చేశారని విమర్శించారు.
వైసీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉంది - హైదరాబాద్‌లో ఏపీ ఉపాధ్యాయురాలు ఆందోళన
బలిజలకు అన్యాయం: నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణం కోసం రూ.29 కోట్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. చిత్తూరులో కాపు భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినా, సీఎం జగన్ స్పందించలేదని విమర్శించారు. తన సొంత నిర్మాణ సంస్థ జేఎంసీ కన్ స్ట్రక్షన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో చేసిన రూ.73 కోట్ల పనుల బిల్లులు ఆపేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపీలో వారికి అనుకూలమైన వారికి మాత్రమే బిల్లులు మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. ఏపీఐఐసీ చైర్మన్ పోస్టు ఇస్తామని చెప్పి, సీఎం జగన్ మళ్లీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో బలిజలకు అన్యాయం జరిగిందని అరణి ఆరోపించారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో బలిజ కులస్తులకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు.
వైఎస్సార్సీపీ నేతకు కొలికపూడి సవాల్: హౌస్ అరెస్ట్
అందుకే జనసేనలోకి: 2002 నుంచే సినీ నటుడు చిరంజీవి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. పవన్ కల్యాణ్‌ను కలిసిన వెంటనే తనను వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ అవమానాలు సహించలేకే జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నా. సంక్షేమ పాలన కోసం నిరంతరం కృషి చేస్తున్న పవన్ కల్యాణ్ పనితనం నచ్చడంతో, జనసేనలో చేరుతున్నా. -ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే
మత్స్యకారులకు ద్వారంపూడి, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి : ఏపీ ఫిషర్మెన్ జేఏసీ