Child Missing in Anantapur: అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి తీవ్ర అపహరణ కలకలం రేపింది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున తల్లి వద్ద ఉన్న తమ చిన్నారి కనబడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురైయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్వయంగా డీఎస్పీ ప్రతాప్ కుమార్ నేతృత్వంలో రెండో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు, పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ, దర్యాప్తు మొదలుపెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్, అమృత భార్యాభర్తలు. అమృత పురిటి నొప్పులతో ఈ నెల 22వ తేదీన అనంతపురం ఆస్పత్రిలో చేరగా మరుసటి రోజు 23వ తేదీన పాపకు జన్మనిచ్చినట్లు చెప్పారు.అయితే, ఇవాళ ఉదయం నాలుగున్నర సమయంలో చిన్నారి కనపడకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఆసుపత్రికి చేరుకుని విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ఎఫ్ఎన్ఓలతో పాటు ఓ మహిళా సెక్యూరిటీని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
తిరుమలలో బాలుడిని అపహరించిన మహిళ- 3గంటల్లో పట్టుకున్న పోలీసులు
చిన్నారి ఆచూకీ లభ్యం: పోలీసుల సీసీ కెమెరాలు పరిశీలించి చిన్నారి ఆచూకీ కనుగొన్నారు. ఆసుపత్రిలో అపహరణకు గురైన చిన్నారి ఆచూకీని పోలీసులు ఛేదించారు. ఆసుపత్రిలో వేరే బాలింతకు తోడుగా వచ్చిన మహిళనే చిన్నారిని తీసుకెళ్లినట్లు పోలీసులు తేల్చారు. అనంతపురం రూరల్ సమీపంలోని పురుగుంట గ్రామంలో ఓ ఇంటిలో చిన్నారి క్షేమంగా ఉన్నట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే పాప ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉండేలా వైద్యులు ఏర్పాటు చేశారని డీఎస్పీ వివరించారు. మహిళ చిన్నారిని ఎందుకు అపహరించింది అనే విషయాలను విచారించి చెబుతామన్నారు.
నీళ్లు కావాలని నిద్రలేపారు - కళ్లెదుటే చిన్నారిని ఎత్తుకుని పారిపోయారు