ETV Bharat / state

ధైర్యంగా ఉండండి - అందరినీ ఆదుకుంటామని వరద బాధితులకు చంద్రబాబు హామీ - Chandrababu Tour in Vijayawada - CHANDRABABU TOUR IN VIJAYAWADA

CM Chandrababu Tour in Flooded Area in Vijayawada: ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో మూడో రోజు నాలుగు గంటల పాటు నిర్విరామంగా పర్యటించారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలు తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో అందుతున్న సాయాన్ని పర్యవేక్షించి, ప్రజలకు ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా దాదాపు 22 కి.మీ మేర జేసీబీపైనే సీఎం ప్రయాణం సాగింది.

CM Chandrababu Tour in Flooded Area
CM Chandrababu Tour in Flooded Area (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 8:09 PM IST

Updated : Sep 3, 2024, 8:35 PM IST

CM Chandrababu Tour in Flooded Area in Vijayawada : ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజూ వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దాదాపు నాలుగున్నర గంటలు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కార్లు వెళ్లే అవకాశం లేని చోట కాన్వాయ్ ను పక్కన పెట్టి భవానీపురం నుండి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో దాదాపు 22 కిలోమీటర్లు జేసీబీపైనే సీఎం పర్యటన సాగింది.

ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ ముంపులో ఉన్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి అందుతున్న సాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి ఆవేదన, బాధను విని ధైర్యం చెప్పిన చంద్రబాబు ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తొలుత భవానీపురం వెళ్లిన చంద్రబాబు అక్కడ బాధితులతో మాట్లాడారు. తమకు సాయం చేరిందని ఇప్పుడు కాస్త వరద తగ్గడంతో సాంత్వన చేకూరిందని ఆ ప్రాంత ప్రజలు చెప్పారు.

ఎవరూ భయపడొద్దు - అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రజలకు మంత్రుల భరోసా - Ministers Visit Flooded Areas

సితార సెంటర్ నుంచి కార్లు వెళ్లలేని పరిస్థితుల్లో కాన్వాయ్ పక్కన పెట్టి జేసీబీ ఎక్కి ముందుకు కదిలారు. దారి పొడవునా బాధితులతో మాట్లాడారు. అదే జేసీబీపై జక్కంపూడి వెళ్లి అక్కడ బాధితులను కలిసి ప్రజలకు అందుతున్న వరద సాయంపై తెలుసుకున్నారు. అనంతరం వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, నున్న, కండ్రిక ఇన్నర్ రింగ్ రోడ్ కు వచ్చి అక్కడి నుంచి తన కాన్వాయ్ కారు ఎక్కి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.

పలు ప్రాంతాల్లో బాధితుల సమస్యలు విన్న చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయం లోపం కారణంగా వేగంగా సాయం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల్లో బాధ్యత, భయం తీసుకురావాలనే కారణంతోనే తాను స్వయంగా మూడు రోజులుగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిపారు. అధికారులు బాధ్యత, మానవీయకోణంలో పని చేయాలని సూచించారు. సరిపడా ఆహార ప్యాకెట్లు పంపుతున్నా ఎందుకు చేరవేయడం లేదని అధికారులను ప్రశ్నించారు.

నీరు తగ్గని ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రాంతాన్ని చూడాలని, సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని భావించిన సీఎం అనేక ప్రాంతాల్లో నాలుగున్నర గంటల పాటు జేసీబీపైనే పర్యటించారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా సీఎం వరద బాధిత ప్రాంతాల్లోనే తిరిగారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు వరద ప్రాంతం నుంచి రామవరప్పాడు వంతెన సమీపంలో సాధారణ ప్రాంతానికి చేరుకున్నారు.

విజయవాడలో హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ - Food distribution With Helicopters

సీఎం అక్కడికి వచ్చే సరికి ఆయన కాన్వాయ్ కూడా ఆ ప్రాంతానికి రాలేదు. దీంతో మరికొంత దూరం అయన జేసీబీపైనే ముందుకు సాగారు. సీఎం రూట్​పై సమాచారం అందుకున్న కాన్వాయ్ అక్కడికి చేరుకోవడంతో అక్కడ నుంచి తన వాహనంలో విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు.

ఈ నాలుగున్నర గంటల పర్యటనలో ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగారు. సీఎంతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా పర్యటిచారు. వరద కారణంగా ఇతర వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో సీఎం సెక్యూరిటీలో కొంత మంది సిబ్బంది మాత్రమే ముఖ్యమంత్రితో వెళ్లగలిగారు.

వరద సహాయక చర్యలపై లోకేశ్ సమీక్ష - బాధితులకు అందుతున్న సాయంపై ఆరా - Lokesh Review Flood Relief

Last Updated : Sep 3, 2024, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.