ETV Bharat / state

ఇలా అయితే కష్టం - మీరే నష్టపోతారు: ఆర్వోకి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరిక - Chevireddy Bhaskar Reddy Warning - CHEVIREDDY BHASKAR REDDY WARNING

Chevireddy Bhaskar Reddy Warning: ఎన్నికల వేళ వైసీపీ నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. ఏకంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారినే హెచ్చరించారు. మేము రాజకీయ నాయకులం అని గుర్తు పెట్టుకోవాలని, లేదంటే మీరే నష్టపోతారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలా చేసింది ఎవరో కాదు, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. మహిళా ఆర్వోని చెవిరెడ్డి హెచ్చరించిన ఘటన ప్రకాశం జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.

Chevireddy_Bhaskar_Reddy_Warning
Chevireddy_Bhaskar_Reddy_Warning
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 9:50 AM IST

Chevireddy Bhaskar Reddy Warning: ‘మరీ ఇంత కఠినంగా ఉంటే కష్టం మేడం, మీరే నష్టపోతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మేం రాజకీయ నాయకులం అని గుర్తు పెట్టుకోవాలి. మా మీద ఇష్టం వచ్చినట్లు ఉల్లంఘన కేసులు పెట్టేస్తున్నారు, మేం ప్రైవేటు కేసులు వేస్తే మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త, కాబట్టి కాస్త చూసీచూడనట్లు వెళ్లండి’ అంటూ ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మహిళా రిటర్నింగ్‌ అధికారిని హెచ్చరించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటు చేసుకుంది.

వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల షెడ్యూల్​ విడుదలయ్యాక చంద్రశేఖర్‌పై మూడు నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 22వ తేదీన తాటిపర్తి చంద్రశేఖర్‌ భార్య తన భర్త తరఫున నామినేషన్‌ దాఖలు చేసేందుకు తమ కుమారుడితో కలిసి వెళ్లారు. కుమారుడు మైనర్‌ కావటంతో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రిటర్నింగ్‌ అధికారిణి శ్రీలేఖతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. అయితే తాము నిబంధనల మేరకే పని చేస్తున్నామని, నియమావళిని ఉల్లంఘిస్తేనే కేసులు నమోదు చేశామని చెవిరెడ్డికి ఆర్వో బదులిచ్చారు.

అయినా యంత్రాంగం తీరుపై చెవిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముందుగా ఆర్వో కేంద్రంలోకి సైతం చెవిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించారు. ఆర్వో ఆఫీస్​లోకి వెళ్లే ప్రతి ఒక్కరూ రిజిస్టర్‌లో సంతకం చేయాలి. సెల్‌ఫోన్లు వెంట తీసుకెళ్లకూడదు. ఈ రెండు నిబంధనలనూ చెవిరెడ్డి అతిక్రమించారు. ప్రతి నామినేషన్‌ను ఆర్వో కార్యాలయంలో వీడియో చిత్రీకరించాలి. చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడాలని చెప్పటంతో ఆ సమయంలో వీడియో చిత్రీకరణ సైతం నిలిపివేసినట్లు తెలిసింది. మహిళా ఆర్వో పట్ల చెవిరెడ్డి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్యాయంగా పేదల ఇళ్లు కూల్చారు: పులివర్తి సుధారెడ్డి

మీడియా ప్రతినిధులకు వార్నింగ్: అయితే చెవిరెడ్డి ఇలా బెదిరింపులకు పాల్పడటం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో మీడియా ప్రతినిధులపై సైతం విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ బెదిరింపులకు దిగారు. గతంలో ప్రత్యేక సమావేశం ఉందంటూ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సమాచారం ఇచ్చారు. దీంతో 15 మంది పాత్రికేయులు అక్కడికి వెళ్లారు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే వారిని తన నివాసానికి చెవిరెడ్డి పిలిపించుకున్నారు. ఇంటికి వెళ్లిన విలేకర్లపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.

తనపై వార్తలు రాసింది, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది ఎవడ్రా, మీ ఇళ్లకు వచ్చి మీ కుటుంబసభ్యుల ముందే కాళ్లు, చేతులు విరుస్తా అంటూ హెచ్చరించారు. ఏడేళ్లు నక్సలైట్‌గా పని చేసి వచ్చానని, తనపై, తన కుమారుడిపై తప్పుడు మెసేజ్‌లు పెడితే ఊరుకోనని బెదిరింపులకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే కఠిన చర్యలుంటాయని అన్నారు. తలకిందులుగా వేలాడదీసి చర్మం వలుస్తానని, దీనికోసం కొందరితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నానంటూ ఇద్దరు విలేకర్ల పేర్లను ప్రస్తావిస్తూ బెదిరించారు. విలేకర్లు తిరిగి మాట్లాడే అవకాశం సైతం ఇవ్వకుండా పనుందంటూ తన కుమారుడు మోహిత్‌రెడ్డిని వెంట పెట్టుకుని కారులో వెళ్లిపోయారు.

మళ్లీ మేమే వస్తాం- లెక్కలన్నీ తేలుస్తాం! బాలినేని హెచ్చరికలు - YSRCP Leaders on ongole clash issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.