Chandrababu was Unable to Take Oath as Chief Minister on Time : బుధవారం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించిన ముహూర్తానికి ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకార కార్యక్రమం అత్యంత లోపభూయిష్టంగా జరిగిన తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. (Traffic Jam on CHANDRABABU Oath Ceremony) ఉదయం 11 గంటల 27 నిమిషాలకు సీఎంగా ప్రమాణం చేయలేకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గవర్నర్ కోసం ఎదురు చూసిన మోదీ : గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer) ప్రమాణ స్వీకార వేదికకు రావడం ఆలస్యం కావడంతో ప్రధాని మోదీ (Modi) సమక్షంలో వేదిక వెనుకనే గ్రీన్ రూములో 11 గంటల 27 నిముషాలకు రిజిస్టర్లో చంద్రబాబు సంతకం చేశారు. గవర్నర్ కోసం ప్రధాని మోదీ, చంద్రబాబు 15 నిముషాల పాటు వేచి ఉన్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం- మోదీ ఆత్మీయ ఆలింగనం - ap new cm cbn
ట్రయల్ రన్ నిర్వహిచని అధికారులు : ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రమాణం చేయించాల్సిన గవర్నర్ వేదికకు ఆలస్యంగా చేరుకోవడంపై ప్రధాని ఆరా తీశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వైఫల్యం వల్లే ఈ ఆలస్యం జరిగినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ సరైన సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేకపోయారు. ట్రాఫిక్‌లో చిక్కుకు పోయి ముహూర్త సమయానికి వేదికకు, విమానాశ్రయానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకోలేకపోయారు. గవర్నర్ కాన్వాయ్ ట్రయల్ రన్ యంత్రాంగం నిర్వహించలేదని సమాచారం.
ట్రాఫిక్‌లో చిక్కుకున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్త : బుధవారం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమ సమయంలో ఉదయం నుంచి ట్రాఫిక్ నియంత్రణను పోలీసులు గాలికి వదిలేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకొని డీజీపీ హరీష్ కుమార్ గుప్త రెండు కిలోమీటర్ల మేర నడిచారు. జరిగిన ఆలస్యం, ట్రాఫిక్ చిక్కులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రాథమికంగా వివరణ కోరినట్లు సమాచారం.