Chandrababu Tribute to Ramoji : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర ఘనంగా సాగింది. ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర రామోజీ గ్రూపు సంస్థల కార్యాలయం మీదుగా స్మారక కట్టడానికి చేరింది. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. స్మృతి వనం వద్ద రామోజీరావు పాడె మోసి నివాళులర్పించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Ramoji Rao Final Rites Journey : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన యాత్ర ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాగింది. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు పార్థివదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఫిల్మ్‌సిటీలోని రామోజీ గ్రూపు కార్యాలయాల మీదుగా స్మారక కట్టడం వరకు అంతిమయాత్ర సాగింది.
అక్షర యోధునికి అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు - Ramoji Rao Final Rites Journey
Media Mogul Ramoji Rao Smruthi Vanam : అంతిమయాత్ర వాహనంపై కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి సోహన, మనవడు సుజయ్, కుటుంబసభ్యులు ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు వాహనంపై వెళ్లారు.
Ramoji Rao Passed Away : రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. రాజకీయ నాయకులు సహా పలువురు ప్రముఖులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్న రామోజీ - Media Mogul Ramoji Rao Smruthi Vanam