ETV Bharat / state

జగన్ తన శవరాజకీయాల కోసం పేదలను బలితీసుకుంటున్నారు: చంద్రబాబు - Chandrababu Shocking Comments - CHANDRABABU SHOCKING COMMENTS

Chandrababu Comments on CM YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి ప్రజల మెడలకు జగన్ ఉరితాడు బిగించారని, చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల భూమి జగన్ గుప్పింట్లో ఉందని ఆరోపించారు. తమ హయాంలో బడ్జెట్ లో 19 శాతం సంక్షేమాని ఖర్చు చేస్తే, జగన్ కేవలం 10శాతం కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. నవరత్నాలు అంటూ, వైసీపీ నేతలు ప్రజలను వంచించారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu Comments on CM YS Jagan:
Chandrababu Comments on CM YS Jagan: (etv bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 10:29 PM IST

Chandrababu Comments on CM YS Jagan: ప్రజల భూములపై వైఎస్ జగన్‌ పెత్తనమేంటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకంటూ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి, ఎన్టీఆర్‌ జిల్లా నూజివీడు, కాకినాడలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడిన ఆయన వైసీపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్‌, అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడిగుద్దుల వర్షం కురిపించారని ఎద్దేవా చేశారు. తాను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారు. బడ్జెట్‌లో 19 శాతం సంక్షేమానికి ఖర్చు చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే జే బ్రాండ్‌ మద్యం నిషేధిస్తామని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా నూజివీడులో భహిరంగ సభలో మాటాడిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జగన్‌కు అభివృద్ధి తెలియదని, విధ్వంసమే తెలుసని ఎద్దేవాచేశారు. భూగర్భ వనరులు దోచుకున్నారని మండిపడ్డారు. నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని చాలా రోజులుగా పోరాడుతున్నారని, వారి కోరిక తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని వెల్లడించారు. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ. 100 లాక్కున్నారని దుయ్యబట్టారు. మొదటి సంతకం మెగాడీఎస్సీపై, రెండో సంతకం ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు రద్దుపైనే అని మరోమారు స్పష్టం చేశారు.

జగన్‌ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేసిన చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

రాత్రి కాకినాడ భహిరంగ సభలో మాట్లాడని చంద్రబాబు ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు ప్రజా గెలుపని, ప్రజల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ త్యాగం చేశాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు అప్పు ఉందని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. జగన్‌ మాట వినని పోలీసుల కుటుంబాల పొట్ట కొట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ దోపిడీ కొనసాగుతుందని ఆరోపించారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్‌ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగనన్న జలగ రాజ్యంలో మెుత్తం దోపిడే అంటూ పేర్కొన్నారు. వాటాలు ఇవ్వకుంటే పరిశ్రమలను తరిమేస్తారని విమర్శించారు. కాపుల సంక్షేమం కోసం రూ.3,200 కోట్లు ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. వడ్డెర కులస్థులకు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ తన శవరాజకీయాల కోసం పేదలను బలితీసుకున్నారని ఆరోపించారు. ఉద్యోగస్తులు ఆలోచించి ఓటేయాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ నేతలు కాకినాడను గంజాయి సిటీగా మార్చారని, పేకాడించే ఎమ్మెల్యే కావాలో ప్రజలకు సేవ చేసే ఎమ్మెల్యే కావాలో తేల్చుకోవాలనిచంద్రబాబు పిలుపునిచ్చారు.

'అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం నా కెంతో ఉపయాగపడింది- ఆ పార్టీకి ఓటేసి రుణం తీర్చుకుంటా' - TDP Videshi Vidya Scheme

వాటాలు ఇవ్వకుంటే పరిశ్రమలను తరిమేస్తారు: చంద్రబాబు (etv bharat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.