ETV Bharat / state

రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: చంద్రబాబు - Chandrababu Message to People

Chandrababu Asked People to Use their Vote in AP: రాష్ట్రంలో ప్రతి ఓక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్​లో పోస్ట్​ చేశారు. రాష్ట్ర భవిష్యత్​ను మార్చేందుకు ప్రజల ఓటే కీలకమని చెప్పారు. మీతో పాటు మరో నలుగురు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు.

chandrababu_message_to_people
chandrababu_message_to_people (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 7:43 PM IST

Chandrababu Asked People to Use their Vote in AP: రాష్ట్ర దశ, దిశను మార్చే ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడిందని మే 13వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్(X)​లో పోస్ట్​ చేశారు. ఉపాధి, ఉద్యోగ అవసరాల కోసం పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఓట్లు వేసేందుకు సొంత ఊళ్లకు తరలిరావాలని కోరారు. ప్రజా చైతన్యం వెల్లివిరవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర భవిష్యత్ ను మార్చేందుకు ప్రజల ఓటే కీలకమని చెప్పారు. మీతో పాటు మరో నలుగురు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. ప్రజల, రాష్ట్ర భవిష్యత్తును మార్చేది వారు వేసే ఓటే అని పేర్కొన్నారు. నిర్భయంగా, నిజాయితీగా, స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

కుప్పంలో ఇంటికి కిలో బంగారం ఇచ్చినా మీకు ఓటేయరు: చంద్రబాబు - Chandrababu Election campaign

Chandrababu Letter to APSRTC MD: 13వ తేదీన పోలింగ్​కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ రాసారు. ఆర్టీసీ బస్సులు పెంచడం ద్వారా ప్రయాణ సౌకర్యంతో ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. 13వ తేదీన ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు వస్తారని గుర్తు చేసారు. ఇప్పటికే హైదరాబాద్​తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు ఏపీలోని తమ ఊళ్లకు ప్రజలు ప్రయాణమవుతున్నారు.

ఇలాంటి సమయంలో సొంత ప్రాంతానికి వెళ్లడానికి ఆర్టీసీ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ బస్టాండ్​లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోందన్న చంద్రబాబు అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్ స్టేషన్లలో నిరీక్షిస్తున్నారని అన్నారు. ఈ రెండుమూడు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేయాలని సూచించారు. రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం వల్ల ఓటింగ్ శాతం పెరగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

పిఠాపురంలో ఉత్సాహంగా సాగిన పవన్‌ రోడ్‌ షో - దారి పొడవునా జనం నీరాజనాలు - Pawan Kalyan Road Show

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.