ETV Bharat / state

విజయవాడలో సీప్లేన్‌- పర్యటకులకు ఇక పండగే - SEAPLANE in vijayawada

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 11:56 AM IST

Rammohan Naidu on Seaplane Operations : పర్యాటక రంగంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సీప్లేన్ నిర్వహణ నిబంధనలను సరళీకరించింది. ఈ కార్యకలాపాలపై ఏపీ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సీప్లేన్‌ విమానాల డెమో మొదలు కానుంది. తొలుత విజయవాడ నుంచే ఈ డెమో ప్రారంభమవుతుంది.

Seaplane Operations in India
Seaplane Operations in India (ETV Bharat)

Seaplane Operations in India : దేశంలో పర్యాటక అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీప్లేన్‌ కార్యకలాపాలకు సహకారం అందించాలని నిర్ణయం తీసుకుంది. నీటిపై ల్యాండ్‌ అవ్వడమే కాక, టేకాఫ్‌ జరిపే సీప్లేన్‌ కార్యకలాపాలకు సంబంధించిన నియమావళిని కేంద్ర పౌర విమానయాన శాఖ సరళీకరించింది. షెడ్యూలేతర సంస్థలు కూడా సీప్లేన్‌ సేవలు అందించడానికి అనుమతించింది. ఈ మేరకు సరళీకృత సర్టిఫైడ్‌ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ప్రాంతీయ విమాన అనుసంధాన పథకమైన ఉడాన్‌ కింద ఈ సీప్లేన్‌ కార్యకలాపాలను ప్రోత్సహించనుంది.

వాటర్‌ డ్రోమ్‌ లైసెన్సు అక్కర్లేదు : డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) సడలించిన నిబంధనల కింద సీప్లేన్‌ కార్యకలాపాలకు వాటర్‌డ్రోమ్‌ లైసెన్సు అవసరం లేదని పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. తాజా వాణిజ్య పైలెట్‌ లైసెన్సు (సీపీఎల్‌) ఉన్న వారు నేరుగా సీప్లేన్‌ రేటింగ్స్‌ను పొంది, సీప్లేన్‌లను నిర్వహించొచ్చని చెప్పారు. గతంలో అండమాన్​-నికోబార్, గుజరాత్​లో సీప్లేన్‌ కార్యకలాపాలు ఉండేవని పేర్కొన్నారు. అయితే ఆర్థికంగా మనుగడ సాధించలేక మూతబడ్డాయన్నారు.

విజయవాడ నుంచే శ్రీకారం : ఈ క్రమంలోనే సీప్లేన్‌ కార్యకలాపాలకు వయబులిటీ గ్యాప్‌ నిధులను కేంద్రం అందిస్తుందని రామ్మోహన్ నాయుడు వివరించారు. భారత్‌లో విమానాలు, హెలికాప్టర్లు, సీప్లేన్ల డిజైన్, తయారీకి ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందని వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు సీప్లేన్‌ కార్యకలాపాలపై ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి మొదలయ్యే సీప్లేన్‌ విమానాల డెమో, విజయవాడ నుంచే ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు.

Seaplane Demo in Vijayawada 2024 : ఆంధ్రప్రదేశ్‌తో పాటు గోవా, అస్సాం, అండమాన్‌ - నికోబార్, లక్షద్వీప్, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి 18 ప్రాంతాల్లో వాటర్‌ ఏరోడ్రోమ్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికల్లో ప్రభుత్వం ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాధారణ విమానాశ్రయాల్లో ఎలాగైతే విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ ఉంటుందో వాటర్‌ ఏరోడ్రోమ్‌లలో సీప్లేన్‌ల టేకాఫ్, ల్యాండింగ్‌ జరుగుతుందని వెల్లడించారు. మూడు సంవత్సరాల్లో 100 మార్గాల్లో ఇవి నడిచేలా చూడాలన్నది ప్రభుత్వ ప్రణాళికని చెప్పారు. వీటివల్ల పర్యాటకం అభివృద్ధి చెందుతుందని అన్నారు. చిన్న నగరాలకు విమాన సేవల కోసం అమలు చేస్తున్న ఉడాన్‌ పథకం గడువు రెండేళ్లలో ముగియనుందన్నారు. దానిని మరో పది సంవత్సరాల పాటు పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.

ఏడాదిలోగా విజయవాడ అంతర్జాతీయ టర్మినల్‌ నిర్మాణం పూర్తి: కేంద్ర మంత్రి రామ్మోహన్​ - Vijayawada airport

అన్నీ మంచి శకునములే!- గన్నవరం విమానాశ్రయ విస్తరణపై కొత్త ఆశలు - Gannavavaram Airport

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.