ETV Bharat / state

పర్యాటక మణిహారంగా అంతర్వేది తీరం - TOURISM HUB IN WEST GODAVARI

టెంపుల్​ టూరిజంగా అభివృద్ధి చేేయనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

TOURISM HUB IN WEST GODAVARI
Tourism In West Godavari (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 12:02 PM IST

Tourism Hub In West Godavari: ఆధ్యాత్మిక కేంద్రంతోపాటు ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కనువిందు చేసే సముద్ర అలలు, చల్లటి గాలులు వీచే సరుగుడు తోటలకు నిలయం అంతర్వేది తీరం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంతోపాటు సాగర సంగమం, దీప స్తంభం, సముద్రం, మడ అడవులు, బోటింగ్‌ చూపరులను కట్టిపడేస్తాయి. సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి.

బందీపూర్‌ తరహాలో చిత్తూరులో జాతీయ పార్కు - కేంద్రానికి ప్రతిపాదనలు

పర్యాటక మణిహారం: కోనసీమ జిల్లాలో సముద్ర తీర ప్రాంతం అంతర్వేది నుంచి భైరవపాలెం వరకు సుమారు 93 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సముద్ర తీరంలో అంతర్వేది, చింతలమోరి, ఓడలరేవు, వాసాలతిప్ప, ఎస్‌ యానాం తదితర బీచ్‌లున్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మణిహారమే అవుతుందని స్థానికులు, పర్యాటకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పర్యాటకులు, భక్తులతో సందడిగా కనిపించే అంతర్వేది బీచ్‌లో మౌలిక సదుపాయాల్లేక సందర్శకులు వచ్చిన వెంటనే వెనుదిరుగుతున్నారు. బస చేయడానికి వసతులను ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జునసాగర్​-శ్రీశైలం బోటు షికారు ప్రారంభం - ప్యాకేజి వివరాలివే

అంతర్వేదిని టెంపుల్‌ టూరిజంగా అభివృద్ధి:అంతర్వేది దీప స్తంభం (లైట్‌హౌస్‌) వద్ద కేంద్ర ప్రభుత్వం సముద్రయాన శాఖ నిధులతో ఉద్యానం నిర్మించినా సందర్శకులకు అందుబాటులోకి రాలేదు. పిల్లలు ఆహ్లాదంగా గడపడానికి జారుడు బల్లలు, ఊయలలు, వాటర్‌ ఫౌంటైన్ తో పాటు పర్యాటకులు సేదతీరడానికి పాలరాతితో గొడుగులాంటి ఆకారంతో నిర్మాణాలను చేపట్టారు. దీనిని అందుబాటులోకి తీసుకురావాలంటే కేంద్రం నుంచి అనుమతులు రావాలని దీపస్తంభం సిబ్బంది తెలుపుతున్నారు.అంతర్వేదిని టెంపుల్‌ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. దీనికి సంబంధించిన ప్రణాళికలు తయారుచేసి మంత్రులు, పర్యాటక శాఖ అధికారులతో చర్చించాం. వారు సానుకూలంగా స్పందించారు. ప్రైవేట్‌ వ్యక్తులను కూడా పర్యాటకాభివృధిలో భాగస్వాములను చేయడానికి కృషి చేస్తున్నామని రాజోలు ఎమ్మెల్యే దేవి వరప్రసాద్ వెల్లడించారు. దీని కోసం 216 జాతీయ రహదారికి లింకుగా రెండు వరసల రహదారిని అంతర్వేదికి కలుపుతూ నిర్మించడానికి మ్యాప్‌ తయారు చేశామని కూటమి ప్రభుత్వంలో అంతర్వేది మరింత అభివృద్ధిని చూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో నూతన పరిశ్రమలు - ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.