ETV Bharat / state

జగన్‌ అనాలోచిత నిర్ణయం - సీబీఎస్‌ఈ విద్యార్థుల సామర్థ్యాలు ఢమాల్ - CBSE Students Problems in AP - CBSE STUDENTS PROBLEMS IN AP

CBSE Students Problems in AP : జగన్‌ అనాలోచిత నిర్ణయాలు నేటి విద్యార్ధులకు శాపంగా మారాయి. కనీస అవగాహన లేకుండా ఒకేసారి 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ పరీక్షా విధానం ప్రవేశపెట్టిన తీరు ప్రచార ఆర్భాటం తప్ప వారికి ఎంత మాత్రం ఉపయోగపడలేదన్నది తేలిపోయింది. ఈ పరీక్షా విధానంలో బోధించే ఉపాధ్యాయులు లేకుండానే తీసుకున్న నిర్ణయాల ఫలితం అంతర్గత మదింపులో వెలుగుచూసింది.

CBSE Students Problems in AP
CBSE Students Problems in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 11:09 AM IST

CBSE Internal Assessment Exam in AP : విద్యార్థులను పునాది స్థాయి నుంచి సన్నద్ధం చేయకుండా, ఉపాధ్యాయులకు కనీస శిక్షణ ఇవ్వకుండా గత వైఎస్సార్సీపీ సర్కార్ ప్రవేశపెట్టిన సీబీఎస్‌ఈ పరీక్షా విధానం ఫలితాలు తిరోగమన దిశలో కన్పిస్తున్నాయి. గతంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌ హడావిడిగా అమల్లోకి తెచ్చిన ఈ విధానం పర్యవసానాలకు ఓ తరం విద్యార్థులు బలి కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

పరీక్షలు రాసిన 77,478 మంది : సీబీఎస్‌ఈ అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల సామర్థ్యాలను అంచనా వేసేందుకు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మదింపు పరీక్షలు నిర్వహించింది. ఇప్పటివరకు బోధించిన సిలబస్‌ నుంచి 50 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 50 మార్కుల చొప్పున కేటాయించారు. దీన్నే 100మార్కులకు లెక్కకట్టారు. ఇందుకు 80,000ల ట్యాబ్‌లు ఉపయోగించారు. మొత్తం 77,478 మంది విద్యార్థులు ఎగ్జామ్స్​ రాశారు.

YSRCP Govt in CBSE Decision : వారిలో ఇంగ్లిషులో 59,518 (76.81 శాతం), గణితంలో 56,213 (72.55 శాతం), సామాన్య శాస్త్రంలో 49,410 (63.77 శాతం), సాంఘిక శాస్త్రంలో 48,766 (62.94 శాతం) మంది ఫెయిల్‌ అయ్యారు. ఏ సబ్జెక్టులోనూ కనీసం సగం మంది పాస్ కాలేదు. ఈ ఫలితాలను చూసి అధికారులు విస్మయానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం 1000 పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలోనే పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే తాజా మదింపు ఫలితాలే రేపు పబ్లిక్‌ పరీక్షల్లోనూ పునరావృతమైతే పరిస్థితి ఏంటని వారు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో? : సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులకు 20 ఇంటర్నల్‌ మార్కులు ఉంటాయి. ఇవి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు వేస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ సుమారు 20 మార్కులు వేయొచ్చని, మరో 20 మార్కులు తెచ్చుకుంటే పాస్‌ అయిపోతారంటూ గత సర్కార్ ఆలోచించిందని అధికారులు ఇటీవల సమీక్షలో లోకేశ్‌ దృష్టికి తెచ్చారు. వాస్తవానికి విద్యార్థులందరికీ ఇంటర్నల్‌ మార్కులు గరిష్ఠంగా 20 మార్కులు వేయడానికి నిబంధనలు ఒప్పుకోవని కూడా వారే మంత్రికి తెలిపారు.

అంతా విన్న మంత్రి లోకేశ్‌ ‘ఇది విద్యార్థుల భవిష్యత్​కు సంబంధించిన విషయం. ఇలాంటి వాటిని నేను అంగీకరించను. సీబీఎస్‌ఈ పరీక్షలు రాసి పిల్లలు ఫెయిల్‌ అయితే, అది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వారు ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. విద్యాశాఖకు సంబంధించి ప్రతి నిర్ణయమూ లోతుగా ఆలోచించి తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.

ఈ సంవత్సరం పదో తరగతి విద్యార్థులు స్టేట్‌ విధానంలో పబ్లిక్‌ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు కూడా బోధనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటికి తోడు తాజాగా అంతర్గత మదింపు ఫలితాలు విద్యాశాఖను నివ్వెరపరిచాయి. మొత్తంగా సీబీఎస్‌ఈ పరీక్షా విధానంలోకి మారేముందే ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవాల్సి ఉండేదని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. దీంతో పాటు విద్యార్థులకు కిందిస్థాయి తరగతుల నుంచే కెపాసిటీ బిల్డింగ్‌పై తగిన కసరత్తు చేసి ఉండాల్సిందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ సంవత్సరం సీబీఎస్‌ఈ పరీక్షా విధానం లేనట్టేనని తెలుస్తోంది. సీబీఎస్‌ఈలోకి మారిన వెయ్యి పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర బోర్డు పరీక్షలే నిర్వహించే అవకాశం ఉంది.

విద్యార్థుల్లో కలవరపాటు : రాష్ట్ర బోర్డు పరీక్షలకు, సీబీఎస్‌ఈ పరీక్షా విధానానికి వ్యత్యాసం ఉంటుంది. ఉపాధ్యాయులు ఈ విధానంలో బోధించాలంటే తగిన శిక్షణ పొంది ఉండాలి. విద్యార్థులను ఫౌండేషన్‌ స్థాయి నుంచే సన్నద్ధం చేయాలి. గత వైఎస్సార్సీపీ సర్కార్ కసరత్తు లేకుండా ఒకేసారి 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చింది. అదే సమయంలో 1000 పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. దీని ప్రకారం ఈ సంవత్సరం ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులందరూ సీబీఎస్‌ఈ విధానంలోనే పరీక్షలు రాయాల్సి ఉంది.

IB Syllabus in AP Schools: ప్రభుత్వ బడుల్లో మరో కొత్త సిలబస్.. ఇంటర్ వరకు ఐబీ అమలు దిశగా అడుగులు

Education Syllabus Changes in AP: 'ఇదేంటి జగన్ మామా..?' పాఠశాల సిలబస్ మార్పుపై విద్యార్థుల్లో అయోమయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.