Case Filed on YS Sharmila: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లా బద్వేల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈనెల ఒకటో తేదీన ఎన్నికల ప్రచారాల్లో భాగంగా బద్వేల్ నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్ షర్మిల సభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఘటనను ప్రస్తావించారు. ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించవద్దని కోర్టు ఆదేశాలున్నాయి. సభలో ఆమె వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కింద బద్వేల్ ఎన్నికల నోడల్ అధికారి ఎస్వీ కృష్ణ భావించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బద్వేలు పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు.
షర్మిలపై కేసు పెట్టిన ఏపీ పోలీసులు- వివేకా హత్యపై మాటలే కారణమట! - case filed on ys sharmila - CASE FILED ON YS SHARMILA
Case Filed on YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 12:30 PM IST