ETV Bharat / state

గ్రూప్‌-2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ విజ్ఞప్తులు - ఏపీపీఎస్సీ నిర్ణయంపై సందిగ్ధం - Appeals For Postpone Group 2 Mains - APPEALS FOR POSTPONE GROUP 2 MAINS

Candidates Request Postpone of APPSC Group 2 Mains Exam: జూలైలో నిర్వహించబోయే గ్రూప్​- 2 మెయిన్స్‌ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ మరికొంత సమయం పెంచాలని పలువురు ఆందోళనలు చేపడుతున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీ​కి విజ్ఞప్తి చేస్తున్నారు .

Candidates Request Postpone of APPSC Group 2 Mains Exam
Candidates Request Postpone of APPSC Group 2 Mains Exam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 8:36 AM IST

Updated : Jun 25, 2024, 9:35 AM IST

Candidates Request Postpone of APPSC Group 2 Mains Exam: వచ్చే నెల 28న నిర్వహించబోయే గ్రూప్-2 మెయిన్స్‌ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సిలబస్‌లో మార్పులు చేయడం ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ పరీక్షకు మరికొంత సమయం పెంచాలంటూ పలువురు ఆందోళనలు చేపడుతున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు. ఈ విన్నపాలపై ఏపీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ​కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి లేఖ - MLC Ramgopal Reddy on Group 2 Mains

గత వైఎస్సార్సీపీ సర్కార్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఐదేళ్లపాటు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయాలంటూ ఎన్నోసార్లు రోడ్డెక్కినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. ఎక్కడ ఓట్లు పోతాయనే భయంతో ఎన్నికల ముందు హడావుడిగా గతేడాది డిసెంబర్ 7న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టి కేవలం 897 పోస్టుల భర్తీకి మాత్రమే ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. గతంలో ఉన్న సిలబస్‌లో మార్పులు చేసి నూతన సిలబస్ ప్రకారమే పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆగమేఘాలపై నియామక ప్రక్రియ చేపట్టింది.

కేవలం 2 నెలలు వ్యవధిలోనే ఫిబ్రవరి 25నే గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 4,83,535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా ప్రిలిమ్స్‌కు 4,04,037 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సరిగ్గా సిద్ధం కాలేకపోవడంతో ఏకంగా 79,498 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఏప్రిల్ 10న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన ఏపీపీఎస్సీ 92,250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు తెలిపింది. సరిపడా సమయం లేక సరిగా ప్రిపేర్ కాలేదని ప్రభుత్వ నిర్వాకంతో తమ కల చెదిరిందంటూ వైఎస్సార్సీపీ సర్కార్‌ను గద్దె దింపడంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల - క్వాలిఫై అయిన అభ్యర్థులు వీరే! - Group 2 Results

మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈసారి కూడా పరీక్షకు చకచకా ఏర్పాట్లు చేస్తుండటంతో నిరుద్యోగులు మరోసారి ఆందోళన చెందుతున్నారు. ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాల విడుదల తేదీ నుంచి మెయిన్స్ పరీక్షకు మధ్య మూడున్నర నెలల సమయం మాత్రమే ఉంది. సిలబస్ మార్చినందున ప్రిపరేషన్‌కు ఈ సమయం సరిపోదని మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు అంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రూప్-3, గ్రూప్- 4 సహా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సైతం ఉన్నత స్థాయి పోస్టు దక్కించుకునేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రిపరేషన్‌కు సమయం తక్కువగా ఉండటంతో వీరంతా కుంగుబాటుకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం తగిన చొరవ తీసుకుని గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష కోసం 3 నెలల గడువు పెంచాలని కోరుతున్నారు.

గ్రూప్‌-1 మార్కుల వెల్లడికీ ఏపీపీఎస్సీ గోప్యత - APPSC RESTRICTIONS ON GROUP 1 MARKS

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయించాలని కోరుతూ పలు జిల్లాల్లోని అభ్యర్థులు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలిస్తున్నారు. కొత్త సిలబస్‌ దృష్ట్యా గ్రూప్-2 మెయిన్స్ రెండు నెలలు వాయిదా వేయాలని MLCలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి రావు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు ఫిబ్రవరి 7న లేఖ రాయగా సానుకూల స్పందన రాకపోవడంతో ఇప్పుడు మరోసారి లేఖ రాశారు. గ్రూప్-2 మెయిన్స్‌ను వాయిదా వేయాలన్న విజ్ఞప్తులను ఏపీపీఎస్సీ పరిశీలిస్తోంది.

డీఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ ఈసీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి లేఖ

Last Updated : Jun 25, 2024, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.