ETV Bharat / state

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక అరాచకం - బయటపెట్టిన కాగ్ - AP CAG REPORT

వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను బయటపెట్టిన కాగ్ నివేదిక - రూపాయిలో 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని వెల్లడి

ap_cag_report
ap_cag_report (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 7:43 PM IST

CAG Report on Financial Affairs Under YSRCP Govt: వైఎస్సార్​సీపీ సర్కార్ ఆర్థిక అరాచకాన్ని కాగ్(Comptroller and Auditor General of India) కడిగేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాగ్ సమర్పించిన నివేదికను కూటమి ప్రభుత్వం శాసనసభ ముందు ఉంచింది. 2023-24లో రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని తెలిపింది. రూపాయిలో 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని వెల్లడించింది. గ్రాంట్-ఇన్-ఎయిడ్‌ ద్వారా 14 పైసలు, రుణాల రికవరీ ద్వారా పైసా ఆర్జించారని కాగ్‌ తెలిపింది. గత ప్రభుత్వంలో రూపాయిలో 15 పైసలు జీతాలకు వెచ్చించారని స్పష్టం చేసింది. డీబీటీలకు 13 పైసలు, వడ్డీలకు 12 పైసలు చెల్లించారని వివరించింది.

గత జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు రూపాయిలో కేవలం 9 పైసలే చెల్లించిందని నివేదికలో కాగ్‌ పేర్కొంది. మూలధన వ్యయంగా 9 పైసలే ఖర్చు చేశారని వెల్లడించింది. ప్రధానమైన పనులకు 9 పైసలే వెచ్చించారని పేర్కొంది. చెల్లించిన అప్పులు రూపాయిలో 7 పైసలే ఉందని నివేదికలో స్పష్టం చేసింది. 2023-24లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.922 కోట్లుగా ఉందన్న కాగ్‌ బడ్జెట్‌ అనుమతి కంటే ఇంధన శాఖకు రూ.217 కోట్లు ఎక్కువ ఖర్చు చేశారని తెలిపింది. అసెంబ్లీ అనుమతి లేకుండా విద్యాశాఖలో రూ.249 కోట్లు అదనంగా ఖర్చు చేశారని స్పష్టం చేసింది.

సరస్వతి ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ ల్యాండ్ - నోటీసులు జారీ

2023 ఏప్రిల్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా వద్ద రాష్ట్ర నిల్వ రూ.19 కోట్లు లోటు ఉందన్న కాగ్‌ 2024 మార్చిలో అది రూ.33 కోట్లు లోటుగా ఉందని వివరించింది. ఏడాది చివరికి పెట్టుబడుల ఖాతాలో అసలు నగదు నిల్వ లేదని స్పష్టం చేసింది. 2023-24లో ప్రభుత్వ అప్పులు రూ.4,86,151 కోట్లుగా ఉన్నాయని కాగ్‌ పేర్కొంది. ప్రభుత్వ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 34 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. 2023-24లో రూ.2,23,004 కోట్ల మేర ప్రభుత్వ గ్యారెంటీలు ఇచ్చారని తెలిపింది. రూ.69,626 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పీడీ ఖాతాలకు బదిలీ చేశారని కాగ్‌ వివరించింది.

ట్రెజరీ బిల్లుల ద్వారా కేవలం 14 రోజుల వ్యవధిలో 20,204 కోట్లు పెట్టినట్టుగా ప్రభుత్వం వాటిని 21,140 కోట్లతో రీడిస్కౌంట్ చేసిందని కాగ్ నివేదికలో తెలిపింది. ఏడాది చివరినాటికి పెట్టుబడుల ఖాతాలో అసలు నగదు నిల్వే లేదని వెల్లడించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గా 32,903 కోట్లుగా తెలిపింది. ఈ మొత్తంలో 10,037 కోట్లు వోచర్ల స్క్రూటినీ ద్వారా బయటపడిందని కాగ్ వివరించింది. అలాగే విద్యుత్ సంస్థలకు సంబంధించిన నాన్ రికవరీ కాస్ట్ గా 14,014 కోట్లను ప్రభుత్వ లెక్కల్లో చూపించారని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.

"అప్పులు పంచుకుంటున్నారు - ఆస్తులు లేవంటున్నారు"

రా రా కూర్చో-మనల్ని ఎవడ్రా ఆపేది - పోలీస్ స్టేషన్​లో మేనల్లుడితో బోరుగడ్డ ముచ్చట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.