ETV Bharat / state

'తెలంగాణకు రావాల్సిన నిధులపై పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి' - BRS Ex MP Vinod Kumar on Budget - BRS EX MP VINOD KUMAR ON BUDGET

Parliament Budget Sessions 2024 : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ కోరారు. ఈసారి టీడీపీపై ఆధారపడి మోదీ కేంద్ర ప్రభుత్వం నడపాల్సి వస్తుందన్నారు. అందుకే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవాలని ఎంపీలకు సూచించారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గత 15 రోజుల నుంచి కేంద్రానికి ఎలాంటి వినతిపత్రాలు ఇవ్వలేదని వినోద్‌ ఆక్షేపించారు.

Parliament Budget Sessions 2024
Ex MP Vinod Kumar on Budget (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 21, 2024, 5:21 PM IST

BRS Ex MP Vinod Kumar on Budget : రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకు రావడంతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు కేటాయించేలా చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు మాత్రమే సమయం ఉందని, బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణలు ఈరోజు, రేపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఖాజీపేట్​లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నవోదయ విద్యాలయాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఏర్పాటు చేయాలని కేంద్రంపై రాష్ట్ర ఎంపీలు ఒత్తిడి తేవాలన్నారు.

"ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం తొలిసారి బడ్జెట్​ ప్రవేశపెడుతుంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వచ్చే ఐదు సంవత్సరాలు మోదీ పరిపాలనకు పునాది వేసేది ఈ బడ్జెట్టే. ఈసారి మిత్రపక్షాల సాకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్ట్​లను సాధించుకోవాలి." -వినోద్ కుమార్, మాజీ ఎంపీ

ఈసారి టీడీపీపై ఆధారపడి మోదీ ప్రభుత్వం నడపాల్సి వస్తుంది : కాంగ్రెస్ 8మంది ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు రావల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవాలని తెలిపారు. ఈసారి తెలుగుదేశం పార్టీపై ఆధారపడి మోదీ కేంద్ర ప్రభుత్వం నడపాల్సి వస్తుందన్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాతీరంలో రూ. 60వేల కోట్లతో పెట్రో కెమికల్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ వచ్చినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయన్నారు. ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడు కొంత మేరకు నిధుల కేటాయింపులు చేసుకుంటున్నట్లు తెలుస్తోందని తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గత 15 రోజుల నుంచి కేంద్రానికి ఎలాంటి వినతిపత్రాలు ఇవ్వలేదని ఆక్షేపించారు.

పెద్దవాగు గండికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం - ప్రాజెక్టు కొట్టుకుపోయినా మంత్రులకు తీరకలేదా? : హరీశ్​ రావు - Harish Rao Tweet on Peddavagu

'15,000,000,000,000 - 15 పక్కన ఇన్ని సున్నాలా!! - మూసీ అభివృద్ధి వ్యూహం వెనక ఉద్దేశమేంటి' - KTR On Musi River Development

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.