Boyfriend Bought Poison to His Girlfriend and She Committed Suicide In Kakinada : ప్రేమించకపోతో వేధింపులు. ప్రేమ పేరుతో మోసాలు, రోజూ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే కాకినాడ జిల్లాలో జరిగింది. మాయమాటలు చెప్పి అమ్మాయిని వలలో వేసుకున్నాడో యువకుడు. అది ప్రేమని నమ్మి ఆ యువతి గుడ్డిగా అతడితో సన్నిహితంగా మెలిగింది. ఏడేళ్లుగా వారిద్దరు ఎంతో చనువుగా ఉంటున్నారు. కానీ అదంతా కపట ప్రేమని తెలిసి ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ ఆమె లవర్ ఏం చేశాడంటే!
ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నాడు. చనువు పెంచుకున్నాడు. కానీ కొన్నాళ్లకే మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇదేంటని ప్రియురాలు నిలదీస్తే కుంటిసాకులు చెప్పాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యు.కొత్తపల్లి ఇసుకపల్లికి చెందిన ములికి ఉమామహేశ్వరరావు కాకినాడ గొడారిగుంటకు చెందిన యువతి(24)ని ప్రేమిస్తున్నాడు. 2017 నుంచి వీరు సన్నిహితంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో చనువుగా మెలిగాడు. చివరకు ఆమె చావుకు కారకుడయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతీసారీ దాటవేసేవాడు. ఇటీవల వారిద్దిరి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా తాజాగా మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలిసిన అతని ప్రియురాలు ఈ నెల 14న అతన్ని నిలదీసింది. దీంతో అతడి నిజస్వరూపం బయటపడింది. చస్తే చావు, నా పెళ్లికి అడ్డురాకు అంటూ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఆమె ఎంత వేడుకున్నా అతడు పెళ్లికి ఒప్పుకోలేదు.
ప్రేమిస్తే ఓకే - కాదంటే హత్యే - ఉసురుతీస్తున్న ఉన్మాదం
దీంతో యువతి మనస్థాపానికి గురైంది. ఆ సమయంలో ఆమె పురుగుమందు కొనేందుకు దుకాణానికి వెళ్లింది. ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించిన ఉమామహేశ్వరావు ఆన్‌లైన్ ద్వారా దుకాణ యజమానికి డబ్బు చెల్లించి ప్రియురాలికి పురుగుమందు కొనిచ్చాడు. అది తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో సర్పవరం పోలీసులు ఉమామహేశ్వరరావును మంగళవారం అరెస్టు చేసి కోర్డులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని సీఐ తెలిపారు.
ప్రేయసిపై బ్లేడ్‌తో దాడి చేసిన ప్రియుడు- ప్రేమ పేరుతో వేధింపులు!