ETV Bharat / state

నాగార్జునసాగర్​-శ్రీశైలం బోటు షికారు ప్రారంభం - ప్యాకేజి వివరాలివే - BOAT TOURISM IN NAGARJUNA SAGAR

ఐదేళ్లుగా ప్రణాళికలు - 120 కిలోమీటర్లు బోటు ప్రయాణం

boat_tour_started_from_nagarjuna_sagar_to_srisailam
boat_tour_started_from_nagarjuna_sagar_to_srisailam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2024, 3:57 PM IST

Boat Tour Started From Nagarjuna Sagar To Srisailam : ప్రకృతి ప్రేమికులు, పర్యటకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. కార్తిక మాసం తొలి రోజైన శనివారం తెలంగాణ పర్యాటక శాఖ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటు ప్రయాణాన్ని ప్రారంభించింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రణాళికలు వేసినప్పటికీ సాగర్‌లో సరైన స్థాయిలో నీరు లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణానదిలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు గరిష్ఠ స్థాయిలో నీటి లభ్యత ఉంది. దీంతో లాంచీ ప్రయాణానికి సరైన సమయం వచ్చింది. అందుకే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటకుల కోసం బోటు ప్రయాణ సేవలను ప్రారంభించింది. దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి మొదటి రోజు రాష్ట్రంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యటకులు తరలివచ్చారు.

నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను వీక్షించేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా పర్యాటకాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫ్యామిలీతో కలిసి టూర్​కు వెళ్లాలా? అయితే ఈ ప్యాకేజీలు మీకోసమే!

కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు శనివారం ప్రారంభించారు. అక్కడినుంచి శ్రీశైలం వరకు 120 కిలోమీటర్ల మేర 7 గంటలపాటు ఈ ప్రయాణం ఉంటుంది. లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా టికెట్‌ ధరలు నిర్ణయించారు. నాగార్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నట్లు పర్యాటకాభివృద్ధి సంస్థ తెలిపింది.

'పర్యాటకుల డిమాండ్​ మేరకు నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించాం. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకుని రెండో రోజే మళ్లీ సాగర్​కు తిరుగు ప్రయాణం అయ్యేలా ఏర్పాటు చేశాం' - పర్యాటక శాఖ అధికారి

చాలెంజ్ : "బాహుబలి గ్రాఫిక్స్​ను మించిపోయేలా!" - మీ కళ్లను మీరే నమ్మలేరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.