ETV Bharat / state

విజయవాడ బస్టాండ్​లో బ్లేడ్ బ్యాచ్ దాడి - ఆర్టీసీ ఉద్యోగికి గాయాలు - BLADE BATCH ATTACK

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు - ఆర్టీసీ కంట్రోలర్‌పై దాడి

Blade Batch Attack on APSRTC Employees in Vijayawada Bus Stand
Blade Batch Attack on APSRTC Employees in Vijayawada Bus Stand (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 12:35 PM IST

Blade Batch Attack on APSRTC Employees in Vijayawada Bus Stand : విజయవాడ నగరంలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ (Pandit Nehru Bus Station)లో బ్లేడ్ బ్యాచ్ గత కొతం కాలంగా వీరంగం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న ఆర్టీసీ కంట్రోలర్‌ కొప్పుల గాంధీపై దుండగులు బ్లేడ్‌తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆర్టీసీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మంగళవారం అర్ధరాత్రి బ్లేడ్‌ బ్యాచ్‌ బస్టాండ్‌లో తిరుగుతుండగా ప్రశ్నించినందుకు దాడి చేసినట్టు సమాచారం. అనంతరం పారిపోతున్న పలువురు దుండగులను పోలీసులు పట్టుకున్నారు.

ఇటీవల బస్టాండ్​లోని టికెట్ కౌంటర్​లోని సిబ్బందిపైనా బ్లేడ్ బ్యాచ్ దాడి చేసింది. పీవీ రావు అనే కండక్టర్​పై దాడి చేసి నగదుతో ఉడాయించారు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్​లో బ్లేడ్ బ్యాచ్ ఆగడాల నివారణకు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు. బస్టాండ్​లో సెక్యూరిటీ, నిఘా పెంచి సిబ్బందికి ప్రయాణికులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

'గంజాయి, బ్లేడ్​ బ్యాచ్​ల బారి నుంచి మా కాలనీని కాపాడండి' - Ganjai Blade Batch in Vijayawada

బెజవాడ బస్టాండ్​లో భద్రతా వైఫల్యం - బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి మూకలు హల్​చల్ - Pandit Nehru Bus Station

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.