Black Stone Industry has Destroyed in YCP Government : ఒకప్పుడు ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఆ పట్టణం ప్రస్తుతం కళ తప్పింది. ఎన్నో పరిశ్రమలతో, కార్మికులతో కళకళలాడిన ఆ ఊరు నేడు వెలవెలబోతోంది. పాలకుల నిర్ణయాలు శాపంగా మారటంతో లాభాలు పండించిన పరిశ్రమలు నేడు నష్టాలు మూటగట్టుకుని మూతపడుతున్నాయి. ఫలితంగా కార్మికులు రోడ్డునపడుతున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత ఊళ్లో మూతపడిన నాపరాయి పరిశ్రమలపై ప్రత్యేక కథనం.
అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలకు అనువైన వాతావరణం తీసుకువస్తాం: భరత్
ఆ ప్రాంతం నాపరాయి పరిశ్రమకు పెట్టింది పేరు : నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని బేతంచర్ల నాపరాయి పరిశ్రమకు పెట్టింది పేరు. బేతంచర్ల, కొలిమిగుండ్ల, బనగానపల్లిలో 500 హెక్టార్లలో నాపరాయి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ముడి సరుకును పరిశ్రమలకు తరలిస్తారు. ఇలాంటి పరిశ్రమలు ఒక్క బేతంచర్లలోనే 500 వరకు ఉండేవి. కానీ నేడు వాటి సంఖ్య 300కు పడిపోయింది. ఆయా పరిశ్రమల నుంచి గతంలో రోజూ వంద లారీల్లో 2 వేల టన్నుల నాపరాయి ఇతర రాష్ట్రాలు సహా విదేశాలకు ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం 40 లారీల నాపరాయి కూడా రవాణా కావటం లేదు. గతంలో ఏడాదికి 300 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. ఇప్పుడు రూ.150 కోట్ల వ్యాపారం కూడా జరగక వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోయారు.
చేనేతకు చేయూతేదీ - కుటుంబ పోషణ కష్టమై కులవృత్తిని వీడుతున్న నేతన్నలు
వైఎస్సార్సీపీకు వ్యతిరేకంగా ఉన్న కంపెనీలపై దాడులు : వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాపరాయి పరిశ్రమ కుదేలైంది. గనుల లీజు ధరలు 5 రెట్లు పెంచేశారు. ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు 11 సార్లు పెరిగాయి. రాయల్టీలు మూడింతలు పెరిగాయి. సేల్స్ ట్యాక్స్ సైతం భారీగా పెరిగింది. గ్రీన్ ట్యాక్స్ మూడింతలు పెరగటంతో రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. తనిఖీల పేరుతో అధికారులు ఎడాపెడా జరిమానా విధిస్తున్నారు. వైసీపీకు వ్యతిరేకంగా ఉన్న కంపెనీలపై దాడులు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిర్వహణ భారం పదింతలు పెరిగి లాభాల్లో ఉన్న పరిశ్రమలు అప్పుల్లోకి వెళ్లిపోయాయి. వీటి ఫలితంగా పరిశ్రమలు నడిపించే స్తోమత లేక చాలామంది తాళాలు వేశారు. మరికొందరు కార్మికుల సంఖ్యను 80 శాతానికి తగ్గించేశారు. గతంలో 5 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తుండగా ప్రస్తుతం వెయ్యి మందికి మాత్రమే పని దొరుకుతోంది.
సొంత ఊళ్లోనే వరుసగా పరిశ్రమలు మూతపడుతున్నా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనకేమీ సంబంధం లేదన్నట్లుగా మిన్నకుండిపోయారు. చాలా మంది కార్మికులు వలసలు పోతున్నా వారికి ఉపాధి కల్పించే మార్గం చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
విద్యుత్ బకాయిలు చెల్లించండి - విశాఖ ఉక్కు పరిశ్రమకు నోటీసులు - Visakha steel industry