ETV Bharat / state

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా - మంత్రి ధర్మాన వ్యాఖ్యలు : పురందేశ్వరి

Purandeshwari comments on vote irregularities: మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లు బూత్ ఏజెంట్​ లుగా ఉండాలని వ్యాఖ్యనించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. దొంగ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలను వైఎస్సార్సీపీ నేతలు ఉల్లంఘించారని విమర్శించారు. ఈ అంశాలపై సీఈసీకి లేఖరాశమన్నారు. బీజేపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ యాత్రలో రాష్ట్రానికి బీజేపీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తామన్నారు.

Purandeshwari comments
Purandeshwari comments
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 3:44 PM IST

Purandeshwari comments on vote irregularities: త్వరలో జరగనున్న ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. మంత్రి ధర్మాన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. వాలంటీర్​లను బూత్ ఏజెంట్​లుగా ఉండాలని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించడం ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్దమన్నారు.

సీఈసీకి లేఖ రాశాం: వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలని ధర్మాన చెప్పడం ఈసీ ఆదేశాలకు విరుద్దంగా ప్రవర్తించడమేనని పురందేశ్వరి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఓటరును పోలింగ్ బూత్ వరకూ తీసుకురావడానికి చేయాల్సిన పనులపై ఈరోజు చర్చిస్తామని వెల్లడించారు. దొంగ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కొందరు ఉల్లంఘిస్తారని పురందేశ్వరి విమర్శించారు. వాలంటీర్లు ఫ్యాన్ గుర్తుపై ఓటేసేలా చేయాలని ముఖ్యమంత్రి జగన్ సభలో చెప్పడం ఈసీ నిబంధనల ఉల్లంఘన అని పురందేశ్వరి మండిపడ్డారు. ఇవన్నీ పొందుపరుస్తూ సీఈసీకి లేఖ రాశామన్నారు.

ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రానికి ఏం చేసిందో చెపుతున్నాం: నరేంద్ర మోదీ పాలనలో అయోధ్య కల సాకారం అయ్యిందని పురందేశ్వరి పేర్కొన్నారు. ప్రజాపోరు యాత్రలో బీజేపీ మన రాష్ట్రానికి ఏం చేసిందో చెపుతున్నామని, బీజేపీని రాష్ట్రంలో ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకొస్తున్నారని పురందేశ్వరి తెలిపారు. పొత్తుపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో బీజేపీ రాజ్యసభ్యులు జీవీఎల్ నరసింహరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ పాల్గొన్నారు.

రానున్న ఎన్నికల్లో వాలంటీర్లే వైసీపీ తరపున బూత్​ ఏజెంట్లుగా కూర్చోవాల్సిన పరిస్థితి : మంత్రి ధర్మాన ప్రసాదరావు

మంత్రి ధర్మాన వ్యాఖ్యలు: ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనడానికి వీల్లేదని ఎన్నికల సంఘం సృష్టంగా చెబుతుంటే ఈ నెల 21వ తేదీన వాలంటీర్ల సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వాలంటీర్లే వైసీపీ తరపున బూత్​ ఏజెంట్లుగా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఈ అంశంలో వాలంటీర్లకు ఎలాంటి అడ్డంకి ఉండదని వెల్లడించారు. ఎన్నికల సంఘం 80 ఏళ్లు దాటిన దివ్యాంగులు, వృద్దులకు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు వేసుకునే వెసులు బాటు ఇచ్చిన నేపథ్యంలో, ఈ ఓట్ల విషయంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషించాలని మంత్రి సూచించారు. వైసీపీ ప్రభుత్వం పడితే వేల సంఖ్యలో ప్రజలు గుండె ఆగి చనిపోతారని ధర్మాన ప్రసాదరావు జ్యోసం చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన పురందేశ్వరి, అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ధర్మాన వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం - సాక్ష్యాధారాలతో ఈసీకి లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.