Visakha railway zone: విశాఖలో రైల్వేజోన్‌కు సంబంధించి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై బొత్స ఆరోపణలను బీజేపీ ఖండించింది. విశాఖ రైల్వేజోన్ కోసం స్థలం ఇవ్వకుండా తాత్సారం చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని, ఆపార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ నిలదీశారు. రాష్ట్రంలో 32 కొత్త రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, 72 రైల్వేస్టేషన్ల అధునీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తోందని వివరించారు.
పీయూష్ గోయల్‌పై, బొత్స ఆరోపణలు రాష్ట్ర ప్రజల మనోభావల్ని దెబ్బతీయడమే అవుతుందని లంకా దినకర్ స్పష్టం చేశారు. రైల్వే జోన్ కోసం భూమి ఇచ్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అసత్య ఆరోపణలు చేశారన్నారు. విశాఖలో రోడ్డు విస్తరణలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి రైల్వే భుమి కేటాయిస్తే, అందుకు బదులుగా భూములు కేటాయించారని గుర్తు చేశారు. ఆ భూములను రైల్వే జోన్ కోసం ఇచ్చినట్లు బొత్స అసత్య ప్రచారం చేస్తున్నారని లంకా దినకర్ మండిపడ్డారు. 2019 నుంచి 2023 వరకూ రైల్వే జోన్ కోసం భూము కేటాయించడానికి వైసీపీ ప్రభుత్వం నిర్లక్షం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కోసం 2020 -21 సంవత్సరానికి రూ. 106 కోట్ల నిధులు కేటాయించినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్షం వల్లే, నిధులు వెనక్కి వెళ్లాయని పేర్కొన్నారు. వివాదంలో ఉన్న భూములను రైల్వేకు కేటాయించారని, గత సంవత్సరం ముడసల్లోవలో భూమి ఇచ్చారని పేర్కొన్నారు. కానీ, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. రైల్వే భూములు తీసుకోని వాటికి ప్రత్యమ్నాయంగా ఇచ్చిన భూములను రైల్వేకోసం ఇచ్చిన భూములు అంటూన్నారని దినకర్ ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సగటున ఏపీకి సంవత్సరానికి 2009 నుంచి 2014 వరకూ సగటున 800 కోట్లు ఇచ్చిందని. బీజేపీ ప్రభుత్వం 7 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు.
రైల్వే జోన్ పై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు: రైల్వే జోన్ పై కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గురివింధగింజకు తన మచ్చ తెలియనట్లుగా మాట్లాడాడని బొత్స పేర్కొన్నారు. తాము రైల్వే జోన్ కోసం ముడసల్లోవ 52 ఎకరాలు గతంలోనే కేటాయించామన్నారు. 2014 -2019 వరకూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి రైల్వే జోన్ ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. రైల్వే, జీవీఎంసీ అధికారులు సర్వే చేసి భూములు కేటాయించినట్లు పేర్కొన్నారు. గతంలో రైల్వే మంత్రిగా ఉన్న పియూష్ ఎందుకు రైల్వే జోన్ నిర్మాణానికి ఎందుకు కృషి చేయలేదని త ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడితే చెల్లుతుందనుకుంటున్నారని విమర్శించారు.
విశాఖ రైల్వేజోన్ ఎప్పుడో చెప్పలేం: కేంద్రమంత్రి