ETV Bharat / state

జగన్‌ పాత్ర నిజమే అయితే క్షమించరానిది - మంత్రిగా చేసినందుకు బాధపడుతున్నా: బాలినేని - BALINENI SRINIVASA REDDY INTERVIEW

సంతకం చేయాలని అర్ధరాత్రి ఒత్తిడి చేయడం తనకు నచ్చలేదన్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి - ఒకటికి నాలుగుసార్లు ఒత్తిడి రావడంతో అనుమానం వచ్చిందని వెల్లడి

Balineni Srinivasa Reddy Interview
Balineni Srinivasa Reddy Interview (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 3:43 PM IST

Balineni Srinivasa Reddy Interview : విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో తన ప్రమేయం లేదని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో తాను సంతకాలు చేయలేదని, ఒకటికి నాలుగుసార్లు ఒత్తిడి రావడంతో అనుమానం వచ్చిందని అన్నారు. జగన్‌ ప్రభుత్వంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈటీవీ-భారత్ ముఖాముఖిలో కీలక విషయాలు తెలిపారు.

ఒప్పందంపై సంతకం చేయాలంటూ అర్ధరాత్రి ఒత్తిడి చేయడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు. ఒప్పందాన్ని కేబినెట్‌లో పెట్టి ఆమోదించుకున్నారని వెల్లడించారు. మంత్రివర్గంలో కూడా విద్యుత్‌ ఒప్పందంపై చర్చ జరగలేదని, యూనిట్ ధర రూ.2.49కి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. తాజాగా విషయం వెలుగు చూసే వరకూ అవినీతి జరిగినట్లు తనకు తెలియదని పేర్కొన్నారు.

జగన్‌ మంత్రివర్గంలో స్వేచ్ఛ ఉండేది కాదని, వైఎస్సార్‌ మంత్రివర్గంలో పూర్తి స్వేచ్ఛ ఉండేదని స్పష్టం చేశారు. మంత్రిగా నిర్ణయం తీసుకొని వైఎస్సార్‌కు చెప్పేవాళ్లమని, జగన్‌ మంత్రివర్గంలో అలాంటి వాతావరణం లేదని వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడూ జగన్‌కు చెప్పేవాడినని, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను జగన్‌ దృష్టికి తీసుకెళ్లేవాడినని బాలినేని తెలిపారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాభిప్రాయం చెప్పడం జగన్‌కు నచ్చలేదన్న బాలినేని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాలే చెబుతారా అని జగన్‌ అనేవారని అన్నారు. అకస్మాత్తుగా మంత్రివర్గం నుంచి తనను తొలగించడం బాధేసిందని తెలిపారు. మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించారో తెలియదని స్పష్టం చేశారు. అదే విధంగా కుటుంబ విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకునేవాడిని కాదని పేర్కొన్నారు.

మంత్రిగా ఎందుకు పనిచేశానా అని బాధపడుతున్నా: విద్యుత్‌శాఖ మంత్రిగా ఫోన్ చేసినా సీఎండీలు స్పందించేవారు కాదని బాలినేని వెల్లడించారు. విద్యుత్ విభాగాల సీఎండీలు కాంట్రాక్టర్ చేతిలో ఉండేవారని, మంత్రిగా ఉన్న తాను కాంట్రాక్టర్‌ చేతిలో ఉండాలా అని సీఎంవోను అడిగానని తెలిపారు. అన్నీ నిలదీసి అడిగాననే మంత్రి పదవి నుంచి తప్పించారని అనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. అమెరికా కేసులో జగన్‌ పాత్ర నిజమే అయితే క్షమించరానిదని బాలినేని వ్యాఖ్యానించారు. ఇలాంటివి చూస్తే జగన్ వద్ద విద్యుత్ మంత్రిగా ఎందుకు పనిచేశానా అని బాధపడుతున్నానని బాలినేని శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు.

అర్ధరాత్రి నిద్రలేపి సంతకం చేయమన్నారు : బాలినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.