ETV Bharat / state

'జగన్​ ప్రభుత్వం పోతే తప్ప రాష్ట్రంలో అడుగుపెట్టను- ఏపీలో మహిళలకు రక్షణలేదు' - Arudra Fires on YSRCP government

Arudra Fires on YSRCP government : వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోతే తప్ప తాను మళ్లీ రాష్ట్రంలో అడుగుపెట్టనంటూ గతంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేక తాను వెళ్లిపోవాల్సి వచ్చింది ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరుమున్నీరవుతూ ఓ వీడియో విడుదల చేశారు.

arudra_fires_on_ysrcp_government
arudra_fires_on_ysrcp_government
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 1:40 PM IST

Arudra Fires on YSRCP government : దివ్యాంగురాలైన తన బిడ్డకు న్యాయం చేయాలంటూ కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన పోరాటాన్ని తెలంగాణ నుంచి కొనసాగిస్తోంది. తన బిడ్డ బాధ చూడలేక ఆమె కన్నీరుమున్నీరవుతూ ఓ వీడియో విడుదల చేశారు. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న కూతురు వైద్యం కోసం ఇళ్లు అమ్మకుంటున్న ఆరుద్రను పోలీసులు అడ్డుకుని తీవ్రంగా వేధించారు.

వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలందరూ వేరే రాష్ట్రానికి పారిపోవాల్సిందే: ఆరుద్ర - Kakinada Arudra Fire on YCP Govt

Kakinada Arudra Latest Updates : పోలీసులపై చర్యలు తీసుకోవాలని గతంలో ఆరుద్ర సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు. మహిళలకు రక్షణ లేక తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు తన కుటుంబానికి చేసిన దుశ్చర్య వల్లే తాను ఈ పరిస్థితిలో ఉన్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు.

Kakinada Arudra Comments on YSRCP Govt : వెన్నుముక దెబ్బతిని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కూతురు లక్ష్మీసాయిచంద్రను తీసుకుని రాష్ట్రానికి దూరంగా బతుకుతున్నానంటూ బాధతో విలపించింది. రాష్ట్రంలో ఆడవాళ్లకు కనీస భద్రత కల్పించ లేని ప్రభుత్వం ఏలుతుందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ పార్టీ, జగన్​ తనను, తన కూతుర్ని మానసికంగా కుంగదీశారని ఆరోపించింది. తన పరిస్థిని రాజకీయం చేయొద్దని వేడుకుంది. నన్ను కలిసి సహాయం చేసిన నాయకులు నా బాధను అర్థం చేసుకున్న వాళ్లు రాజకీయ లబ్ది కోసం కాదు అని పేర్కొన్నారు.

పొరుగు రాష్ట్రం ఆరుద్ర పోరాటం- 'ఏపీలో మహిళలకు రక్షణ లేకనే నేను వెళ్లిపోవాల్సి వచ్చింది'

Kakinada Arudra met Chandrababu: పిచ్చివాళ్లమని ముద్ర వేశారు.. చంద్రబాబు ఎదుట కాకినాడ ఆరుద్ర ఆవేదన

అధికారపార్టీకి చెందిన నేతలు తమ కుటుంబంపై పిచ్చివాళ్లమనే ముద్ర వేసి నరకం చూపిస్తున్నారంటూ కాకినాడకు చెందిన మహిళ ఆరుద్ర కన్నీరు మున్నీరుగా విలపించారు. కుమార్తె వైద్యం కోసం పోరాడుతున్న తమను ఆదుకోవాల్సింది పోయి ఆస్తులనూ అమ్ముకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ అండగా ఉంటానని హామీ ఇచ్చినా న్యాయం జరగలేదన్నారు. గత కొంతకాలంగా కన్నబిడ్డ ఆరోగ్యం కోసం ఆరుద్ర పోరాడుతున్నారు. కుమార్తెకు వైద్యం చేయించాలనే తాపత్రయంతో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గతంలో ఆరుద్ర ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అనేక సార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఆరుద్రకు న్యాయం జరగలేదు.

Chandrababu on Arudra Issue: ఆరుద్రపై పిచ్చి ముద్ర వేయడం సైకో పాలనకు పరాకాష్ట.. చంద్రబాబు ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.