ETV Bharat / state

గుంటూరులో తుపాకీ మిస్‌ఫైర్ - ఏఆర్ కానిస్టేబుల్ మృతి - GUN MISFIRE IN GUNTUR

తుపాకీ మిస్‌ఫైర్ - ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఏఆర్ కానిస్టేబుల్ మృతి

gun_misfires_in_guntur
gun_misfires_in_guntur (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 4:06 PM IST

Updated : Nov 22, 2024, 6:37 PM IST

AR Constable Dies After Gun Misfires in Guntur: తుపాకీ మిస్‌ఫైర్‌ అయి ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్​గా పని చేస్తున్న శ్రీనివాస్ సంపత్ నగర్​లోని శృంగేరి శంకర మఠం వద్ద విధులు నిర్వహిస్తున్నారు. విదుశేఖర భారతి స్వామి పర్యటన ఉండటంతో అక్కడ ఎస్కార్ట్ కోసం శ్రీనివాస్ వెళ్లారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో శ్రీనివాస్ చేతిలోని తుపాకి పేలింది. తూటా ఆయన నుదుటిపై తగిలింది. వెంటనే తోటి కానిస్టేబుళ్లు శ్రీనివాస్​ను జీజీహెచ్​కు తరలించారు. అయితే ఈలోపే శ్రీనివాస్ మృతి చెందారని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో తుపాకి ఎలా పేలిందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్ ఫైర్ అయిందా లేకా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

అదిరిన సీన్​ - పవన్​ను ఆలింగనం చేసుకున్న బొత్స - ముఖం చాటేసిన పెద్దిరెడ్డి

ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు - నేను ఇంత వరకూ ఆయన్ను చూడలేదు : షర్మిల

Last Updated : Nov 22, 2024, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.