ETV Bharat / state

ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వైరల్ - షాక్ ఇచ్చిన అధికారులు - లోకేశ్ చొరవతో మళ్లీ విధుల్లోకి - TUNI RTC DRIVER ISSUE

ఆర్టీసీ డ్రైవర్‌ లోవరాజు డ్యాన్స్ - సోషల్ మీడియాలో వైరల్

Tuni RTC Driver Issue
Tuni RTC Driver Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 12:26 PM IST

Tuni RTC Driver Lovaraju Issue : చిన్న రోడ్డు ఎదురుగా ట్రాక్టర్‌ ముందుకెళ్లలేని పరిస్థితి. ఏం చేయలేక ఆ ఆర్టీసీ డ్రైవర్‌ బస్సును నిలిపేశాడు. ఈలోగా ప్రయాణికులకు వినోదం పంచడానికి సరదాగా కాసేపు నృత్యం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. నెటిజన్లు కూడా సూపర్ డ్యాన్స్ అంటూ కామెంట్లు పెట్టారు. ఇది కాస్తా ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు కేటాయించకుండా డ్రైవర్‌ను పక్కనపెట్టారు. ఈలోగా డ్యాన్స్ వీడియో మంత్రి లోకేశ్‌ దృష్టికెళ్లడం ఆయన డ్రైవర్ డ్యాన్స్​ను ఎక్స్‌ వేదికగా ప్రశంసించారు. దీంతో అతనికి ఈరోజు నుంచి విధులు కేటాయిస్తూ అధికారులు రైట్‌రైట్‌ చెప్పేశారు. ఇదీ కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపో డ్రైవర్‌ లోవరాజు కథ.

లోవరాజు తుని ఆర్టీసీ డిపోలో పొరుగు సేవల విధానంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న రౌతులపూడి నుంచి తుని డిపోకు బస్సు వెళ్తుండగా మార్గం మధ్యలో కర్రల లోడు ట్రాక్టర్‌ అడ్డుగా నిలిచిపోయింది. దీంతో బస్సును నిలిపివేశారు. ఈ సమయంలో ఓ యువకుడు వీడియో తీస్తుండగా లోవరాజు బస్సు ముందు నిల్చొని డ్యాన్స్ చేశాడు. దీంతో లోవరాజుకు అధికారులు తాత్కాలికంగా విధులు కేటాయించలేదు.

APSRTC Driver Dance Video Viral : మరోవైపు సోషల్ మీడియాలో డ్రైవర్‌ లోవరాజు డ్యాన్స్ చూసిన మంత్రి లోకేశ్‌ డ్యాన్స్‌ సూపర్‌ బ్రదర్‌ కీప్‌ ఇట్‌ అప్‌ అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి ఓ వ్యక్తి స్పందిస్తూ ‘అన్న మీరు ట్వీట్‌ చేయకముందే ఈ డ్రైవర్‌ను సస్పెండ్‌ చేసేశారట దయచేసి పరిశీలించగలరు. క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం కానీ దారిలో కొంత హాని చేయని వినోదం నేరం కాదు’ అని పోస్ట్‌ చేశారు. దీనిపై అమెరికాలో ఉన్న లోకేశ్‌ వెంటనే స్పందించారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులు రద్దు చేస్తారని, అతన్ని వెంటనే విధుల్లోకి తీసుకుంటారని చెప్పారు. తాను వచ్చిన తర్వాత లోవరాజును వ్యక్తిగతంగా కలుస్తానని పోస్ట్‌ చేశారు. మంత్రి లోకేశ్ స్పందనపై డ్రైవర్‌ లోవరాజు సంతోషం వ్యక్తం చేశారు.

వైద్య విద్యార్థినికి మంత్రి లోకేశ్​ ఆర్థికసాయం - Minister Lokesh Help

రాష్ట్రానికి రాలేననుకున్నా- లోకేశ్ సాయంతో ప్రాణాలతో తిరిగొచ్చా: గల్ఫ్ బాధితుడు వీరేంద్ర - Lokesh saved Virendra Kumar

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.