ETV Bharat / state

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల - క్వాలిఫై అయిన అభ్యర్థులు వీరే! - Group 2 Results - GROUP 2 RESULTS

APPSC Group 2 Prelims Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌ -2 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు కొన్ని వారాల నుంచి ఉత్కంఠతో ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు ఏపీపీఎస్సీ ఈ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. కాగా గ్రూప్‌- 2 మెయిన్స్‌ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నారు.

appsc_group2
appsc_group2
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 7:12 PM IST

APPSC Group 2 Prelims Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌ -2 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 899 గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్‌ 21 నుంచి జనవరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించిన ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు కొన్ని వారాల నుంచి ఉత్కంఠతో ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు ఏపీపీఎస్సీ ఈ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత పొందగా 2,557 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో రిజెక్ట్‌ అయ్యారు. ఈ మేరకు క్వాలిఫై అయిన, రిజెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాలను వేర్వేరుగా ఏపీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. కాగా గ్రూప్‌- 2 మెయిన్స్‌ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.