ETV Bharat / state

రేపే పదో తరగతి ఫలితాలు విడుదల - ఇలా వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి - AP SSC Results 2024 - AP SSC RESULTS 2024

AP SSC Results 2024: పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులకు బిగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. సంవత్సరం పాటు ఎంతో కష్టపడి చదివి రాసిన పరీక్షల ఫలితాల విడుదలపై బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 22వ తేదీన ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

AP_SSC_Results_2024
AP_SSC_Results_2024
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 7:19 PM IST

Updated : Apr 21, 2024, 6:06 AM IST

AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధిని, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌అప్‌డేట్‌ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 18 నుంచి మార్చి 30 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు 22వ తేదీ ప్రకటించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.

త్వరలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల - Telangana Inter Results Release

వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకునేలా ఏర్పాట్లు: రాష్ట్రంలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 6 లక్షల 30 వేల 633 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3 వేల 473 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 8వ తేదీతోనే ముగించారు. మరోసారి జవాబు పత్రాల పరిశీలన, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను సైతం ఇప్పుటికే పూర్తి చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్టూడెంట్స్ ఫలితాలను చెక్‌ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానంద్‌ను పదో తరగతి పరీక్ష ఫలితాలపై ఇప్పటికే పలుమార్లు ఈటీవీ భారత్‌ ప్రతినిధి సంప్రదించారు.

AP SSC Results 2024
AP SSC Results 2024

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips

వెబ్‌సైట్‌లో ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి: టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల చేయగానే ఎలాంటి సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారు. అధికారికంగా పరీక్షా ఫలితాలు విడుదల చేసిన వెంటనే విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు స్వయంగా ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

దాదాపు 6.3 లక్షల రెగ్యులర్‌ విద్యార్ధులతో పాటు మరో లక్ష వరకు ప్రైవేట్‌లో పరీక్షలు రాసిన వారు ఒకేసారి చెక్‌ చేసుకున్నా సర్వర్‌ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే గ్రేడింగ్‌ ప్రక్రియను సైతం పూర్తి చేసి మార్కుల షీట్స్‌ను ప్రిపేర్‌ చేస్తున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధుల హాల్‌ టికెట్‌ నెంబర్‌ను పొందుపరిచి https://Results.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చూసుకోవచ్చు.

మార్కుల మెమోను తాత్కాలికంగా ఈ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఫలితాలను వెల్లడించిన తర్వాత పాఠశాలకు వెళ్లి మార్క్స్ మెమోను అధికారికంగా తీసుకోవాలి. మెమోలను పాఠశాలకు పంపడంలో ఆలస్యం కాకుండా ఫలితాల వెల్లడితో పాటు పార్శిల్‌ ప్రక్రియను సైతం చేస్తున్నారు. మార్క్స్ షీట్‌ గ్రేడ్స్‌గా ఉంటుంది. ఎక్కడా ఏ సబ్జెట్‌లో ఎన్ని మార్కులు పొందారో తెలియదు. కేవలం సబ్జెట్‌ వారీగా గ్రేడింగ్‌ మాత్రమే సర్టిఫికేట్​లో ఉంటుంది.

పోటీ పరీక్షలు రాస్తున్నారా? ఈ 5 టిప్స్​ పాటిస్తే విజయం పక్కా! - Competitive Exam Success Tips

Last Updated : Apr 21, 2024, 6:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.