ETV Bharat / state

యువతకు గుడ్​న్యూస్ - ఒకేషనల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

రాష్ట్రంలో 1.10 కోట్ల మంది డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగులు - వీరందరికీ ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించేందుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ చర్యలు

AP Vocational Skills Training
AP Vocational Skills Training (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

AP Vocational Skills Training : ఒకేషనల్‌ ఉద్యోగాల రంగంలో భారీ ఉపాధి అవకాశాలు ఉండడంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) దీనిపై ఫోకస్ పెట్టింది. ఏపీలో డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగులు 1.10 కోట్ల మంది ఉండడంతో వీరందరికీ ఒకేషనల్‌ రంగంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నైపుణ్య శిక్షణ చేపట్టింది. ప్రారంభ వేతనం కొంత తక్కువగా ఉండడం దీనికున్న అవకాశాలను యువత పట్టించుకోకపోవడంతో ఉద్యోగాలున్నా నిపుణుల కొరత తీవ్రంగా ఉంది.

నౌకరీ, లింక్డ్‌ఇన్ల్ లాంటి జాబ్‌ పోర్టల్స్‌ నివేదికల ప్రకారం స్థిరాస్తి రంగ వృద్ధితో ప్రతినెలా వేలసంఖ్యలో ఎలక్ట్రీషియన్, ఫ్లంబర్, కార్పెంటర్, ఏసీ రిపేరర్‌ తదితర ఉద్యోగాలు వస్తున్నాయి. క్లరికల్‌ ఉద్యోగాలతో పోల్చితే మొదట్లో కొంత తక్కువగా వేతనాలు ఉన్నా సీనియారిటీ వచ్చే కొద్దీ మంచి వేతనాలు అందుతున్నాయి. ప్రారంభంలో టెక్నీషియన్‌కు రూ.15,000ల నుంచి 18,000ల జీతం లభిస్తుంది. రెండు సంవత్సరాలకు సూపర్‌వైజర్‌ అయితే రూ.30,000ల నుంచి రూ.40,000లు వస్తున్నాయి. భవిష్యత్​లో సొంత కంపెనీలను ఏర్పాటు చేసుకోవచ్చు. అర్బన్‌ కంపెనీ ఇలాంటిదే. ఈ కంపెనీలకు ఇప్పుడు విదేశాల్లో డిమాండ్‌ ఉంది. వీటితోపాటు డీటీపీ, ప్రకటనలు, డిజిటల్‌ వ్యాపారంలో అవకాశాలకు శిక్షణ చేపట్టారు. జాతీయ, అంతర్జాతీయంగా ఈ సేవలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ సేవలలో పెట్టుబడులు పెరుగుతున్నాయి.

శిక్షణ ఇచ్చి- ఉద్యోగ కల్పన : ప్రస్తుతం రెండు సంస్థలు ఈ శిక్షణను కొనసాగిస్తున్నాయి. రివలూష్యనరీ సంస్థ శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పిస్తుంది. ఈ సంస్థ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి విజయవాడలో ఎలక్ట్రీషియన్‌ శిక్షణ అందిస్తుంది. మరో రెండు వారాల్లో ఇదే సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరులోనూ శిక్షణ ప్రారంభించనున్నారు.

  • ఒకేషనల్‌ ఉద్యోగాల శిక్షణ 2 నుంచి 3 వారాలు ఉంటుంది
  • ఆధునిక టూల్‌కిట్‌పై శిక్షణ ఇచ్చి, కిట్‌ను అందిస్తున్నారు
  • శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు
  • సంవత్సరానికి ఈ రంగంలో ఈ సంస్థ 7,000ల ఉద్యోగాలు కల్పిస్తుంది
  • ఏపీ వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో శిక్షణ ప్రారంభించనున్నారు.

ఇతర వాటిల్లోనూ : నాన్‌ గ్రాడ్యుయేట్లకు స్థానికంగా అవకాశాలు కల్పించేందుకు శ్రీసైనేజెస్‌ సంస్థ శిక్షణ ఇస్తోంది. డీటీపీ, సైనేజ్‌ ఫ్యాబ్రికేషన్‌లో ఉద్యోగాలు కల్పించనుంది. విజయవాడ వరద ప్రాంతాల్లోని నిరుద్యోగుల కోసం మొదట శిక్షణ ప్రారంభించారు. ఒక్కో బ్యాచ్‌కు 30మంది చొప్పున శిక్షణ అందించనుంది. విజయవాడ చుట్టుపక్కల ఇతర సైనేజ్‌ కంపెనీలతోనూ ఈ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

కేంద్రం కొత్త స్కీమ్​ - నెలకు రూ.5వేలు స్టైఫండ్ - టాప్‌ కంపెనీల్లో ఇంటర్న్​షిప్​!

కెమికల్ డిప్లొమా కోర్సులపై యువత ఆసక్తి - పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.