ETV Bharat / state

కొనసాగుతున్న లాటరీ ప్రక్రియ - అందరిలోనూ టెన్షన్​ - ఇతర రాష్ట్రాల వారికి అదృష్టం

కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతున్న లాటరీ ప్రక్రియ - బెదిరింపులకు పాల్పడితే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్న ఎంకే మీనా

AP Liquor Shops Lottery
AP Liquor Shops Lottery (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2024, 1:17 PM IST

AP Liquor Shops Lottery Process: ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లైసెన్సులు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పారదర్శకంగా మొత్తం లాటరీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో లాటరీ నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే నేరుగా జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.

లాటరీ సమయంలో దరఖాస్తుదారు హాజరు తప్పనిసరి కాదని తెలిపారు. దరఖాస్తుదారు లేనప్పటికీ వారికి లాటరీ తగిలితే సమాచారం అందజేస్తారన్నారు. దుకాణాల వారీగా వచ్చిన దరఖాస్తులను లాటరీ తీసి, వారికి దుకాణాలను అప్పగిస్తున్నారు. లాటరీలో గెలుపొందిన లైసెన్స్ దారుడికి దుకాణం నిర్వహించుకునేందుకు రెండేళ్ల కాలపరిమితి ఉంది. మద్యం దుకాణాలను మంగళవారం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనున్నారు. బుధవారం నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది.

శ్రీకాకుళం జిల్లాలో 158 మద్యం దుకాణాలకు గాను 4 వేల 6 వందల 71 దరఖాస్తులు చేసుకున్నారు. అంబేడ్కర్ కళావేదికలో జరుగుతున్న లాటరీ ప్రక్రియ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అబ్కారీశాఖ ఉప కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతుంది. దీనిలో భాగంగా శ్రీకాకుళం, ఆమదాలవలస, రణస్థలం, పొందూరు, నరసన్నపేట, కొత్తూరు, పాతపట్నం, టెక్కలి, కోటబోమ్మాళి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం సర్కిళ్లకు లాటరీ తీస్తున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. విజయనగరం జిల్లాలో మొత్తం 153 షాపుల‌కు గాను 5,242 ధ‌ర‌ఖాస్తులు అందాయి. వీటిని లాట‌రీ తీసేందుకు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మొత్తం 10 కౌంటర్ల‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్ర‌క్రియ‌ను డిజిట‌ల్ స్క్రీన్‌పై ప్ర‌ద‌ర్శించారు. కెమెరాల్లో రికార్డు చేశారు.

విశాఖ జిల్లాలో 155 దుకాణాలకు గాను 4,139 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో ముగ్గురిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు. తదుపరి క్షుణ్ణంగా పరిశీలించి లాటరీలో మొదటి వచ్చిన వారిని దుకాణానికి ఎంపిక చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా 135 మద్యం దుకాణాలు గాను 3214 దరఖాస్తులు వచ్చాయి. ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో లాటరీ ప్రక్రియ జరుగుతోంది. దరఖాస్తుదారులలో మహిళలు అధికంగా ఉన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకున్న అధిక సంఖ్యలో రావడంతో సందడి వాతావరణం నెలకొంది.

మద్యం దుకాణాలకు వేళాయె - లెక్క తేలింది కిక్కు ఎవరికో!

దుకాణాలు దక్కించుకున్న ఇతర రాష్ట్రాల వ్యాపారులు: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నగరంలో మొత్తం 133 దుకాణాలకు సంబంధించి 5 వేల 825 దరఖాస్తులు వచ్చాయి. సీరియల్ నెంబర్ ప్రకారం అధికారులు లాటరీ తీస్తున్నారు. గురునానక్ కాలనీలోని NAC కల్యాణ మండపంలో జరుగుతున్న లాటరీకి మహిళా దరఖాస్తుదారులు కూడా హాజరయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 123 షాపులకు లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు. 3 మద్యం దుకాణాలకు 2942 దరఖాస్తులు దాఖలయ్యాయి. కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాలు ఇతర రాష్ట్రాల వ్యాపారులు సైతం దక్కించుకున్నారు. మచిలీపట్నంలో 1వ నెంబర్‌ దుకాణాన్ని కర్ణాటక వాసి మహేష్‌ ఎ బాతే, 2వ నెంబర్ షాపును యూపీ వాసి లోకేష్ చంద్ దక్కించుకున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలోని 52 మద్యం దుకాణాలకు గాను 1393 దరఖాస్తులు వచ్చాయి. పార్వతీపురం బైపాస్ రోడ్డులో ఉన్న M.A.నాయుడు పంక్షన్ హాల్​లో లాటరీ ప్రక్రియ ద్వారా దుకాణాలను కేటాయిస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 144 మధ్య దుకాణాలకు సంబంధించి 5,499 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఏలూరు మినీ బైపాస్​లో చలసాని గార్డెన్ కల్యాణ మండపంలో లాటరీ ప్రక్రియ ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 175 మద్యం దుకాణాలకు నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లాటరీ ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 175 షాపులకు సంబంధించి 5627 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తు దారులు తరలివచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని టౌన్ హాల్​లో నూతన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది.

మద్యం దుకాణాల దరఖాస్తుల ఆదాయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

ప్రకాశం జిల్లాలో మద్యం వేలం పాట కార్యక్రమం పగడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. జిల్లాలోని 171 మద్యం షాపుల కేటాయింపు కోసం పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఈ దుకాణాల కోసం 3461 దరఖాస్తులు అందాయి. నెల్లూరు జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లు ప్రశాంతంగా సాగుతున్నాయి. నగరంలోని కస్తూరిబా కళాక్షేత్రంలో లాటరీ ప్రక్రియ సాగుతోంది. జిల్లాలోని 182 మద్యం దుకాణాలకు 3872 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

వైఎస్ఆర్ జిల్లాలో 139 మద్యం దుకాణాలకు సంబంధించి 3257 దరఖాస్తులు వచ్చాయి. కడప జడ్పీ కార్యాలయంలో లాటరీ ప్రక్రియను మొదలుపెట్టారు. దరఖాస్తుదారులందరూ ఉదయం 8 గంటలకే జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా కడప నగరపాలక సంస్థ పరిధిలోని 21 మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ ప్రక్రియ నిర్వహించారు. 21 దుకాణాలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులకు దక్కడం విశేషం.

కర్నూలు జిల్లా మద్యం దుకాణాలకు సంబంధించిన లబ్దిదారులను ఎంపిక చేసే లక్కీ డిప్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్యక్రమం జరుగుతోంది. జిల్లాలో 99 మద్యం షాపులకు 3 వేల 46 అప్లికేషన్లు వచ్చాయి. జిల్లా పరిషత్ కార్యాలయం చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గేటు పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో మద్యం దుకాణాల లాటరీని కలెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రారంభించారు. జిల్లాలోని 111 దుకాణాలకు 2వేల160 దరఖాస్తులు వచ్చాయి. లైసెన్స్ పొందిన వివరాలను అధికారులు వెల్లడిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ముందుగా హిందూపురం, ధర్మవరం డివిజన్లకు సంబంధించి మద్యం షాపుల ఎంపిక జరుగుతోంది.

ఏపీలో మద్యం ధరలపై చట్టసవరణ - విదేశీ బాటిళ్ల ఎమ్మార్పీపై ఎంత పెంచారంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.