ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 8 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sun Sep 08 2024- 'చిరుత ఆ ప్రాంతంలోనే సంచరిస్తోంది - ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలి' - DFO ON LEOPARD ROAMING

author img

By Andhra Pradesh Live News Desk

Published : Sep 8, 2024, 7:55 AM IST

Updated : Sep 8, 2024, 10:45 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

10:43 PM, 08 Sep 2024 (IST)

'చిరుత ఆ ప్రాంతంలోనే సంచరిస్తోంది - ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలి' - DFO ON LEOPARD ROAMING

DFO Bharani on Leopard Roaming : తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోనే చిరుత సంచరిస్తోందని డీఎఫ్‌వో భరణి తెలిపారు. చిరుత జాడ కనిపెట్టేందుకు 50 ట్రాప్ కెమెరాలు, నాలుగు బోన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శివారు గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:32 PM, 08 Sep 2024 (IST)

కోస్తాంధ్ర జిల్లాల్లో దంచికొట్టిన వానలు - అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని హెచ్చరికలు - Rains in Coastal Andhra Districts

Coastal Andhra Districts Experiencing Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వీధుల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లంక గ్రామల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కొండవాగులు పొంగి ఉద్ధృతంగా ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:58 PM, 08 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక - prakasam barrage flood increasing

Prakasam Barrage Flood Increasing : కృష్ణా నదికి మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ప్రస్తుతం 13 అడుగుల నీటిమట్టం ఉంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద పెరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్‌ గేట్లను అమరికపై ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ పటిష్టతకు నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:53 PM, 08 Sep 2024 (IST)

కోలుకుంటున్న విజయవాడ- సాయంపై స్థానికుల్లో భావోద్వేగం - present situation in vijayawada

Present Situation in Vijayawada: బుడమేరు ఉద్ధృతితో వారం రోజులుగా ముంపులో ఉన్న విజయవాడ కాలనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. నీరు తగ్గిన కాలనీల్లో ప్రభుత్వం పారిశుద్ధ్యం, విద్యుత్‌ పునరుద్ధరణ పనులను ముమ్మరం చేసింది. వైద్య సేవలను యుద్ధ ప్రాతిపదికన అందిస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:53 PM, 08 Sep 2024 (IST)

బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ఇప్పుడు మరింత బరువు - Balapur Laddu Auction Rules

Balapur Ganesh 2024: మనకు బాలాపూర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది లడ్డూ. దశాబ్దాలుగా తెలంగాణలో నిర్వహించే వేలంపాటలో రికార్డుస్థాయిలో ఇక్కడ లడ్డూకు భారీ ధర పలుకుతూ అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, ఈసారీ బాలాపూర్ లడ్డూ వేలంపాటకు కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు ఉత్సవ సమితి పేర్కొంది. ఆ నిబంధనలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:14 PM, 08 Sep 2024 (IST)

కకావికలం అవుతోన్న శ్రీకాకుళం- వాయుగుండం ప్రభావంతో దంచికొడుతున్న వానలు - Heavy Rains in Srikakulam District

Heavy Rain Falling in Srikakulam District : వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు ప్రమాదకరంగా మారాయి. ఐఎండీ విభాగం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నడుమ విద్యాసంస్థలకు కలెక్టర్ రేపు సెలవు ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:23 PM, 08 Sep 2024 (IST)

హైడ్రా కీలక నిర్ణయం - ఇప్పటికే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చం : ఏవీ రంగనాథ్‌ - Hydra Clarify On Demolitions

Hydra Clarity On Demolitions : తెలంగాణ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పరిధిలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో నివాసం ఉంటే, వాటిని కూల్చబోమని తెలిపింది. ఈ మేరకు హైడ్రా కూల్చివేతలపై కమిషనర్‌ రంగనాథ్‌ వివరణ ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:17 PM, 08 Sep 2024 (IST)

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం చంద్రబాబు భేటీ - వరద పరిస్థితిపై వివరణ - Chandrababu met Abdul Nazeer

CM Chandrababu met Governor Abdul Nazeer: విజయవాడ రాజ్ భవన్​లో గవర్నర్ అబ్దుల్ నజీర్​తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. వరద ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులును ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. మరోవైపు బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను రేయింబవళ్లూ పర్యవేక్షించిన మంత్రి రామానాయుడును అధికారులు, మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి అభినందించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:47 PM, 08 Sep 2024 (IST)

భారీ వర్షాలతో రాష్ట్రంలో 45 మంది మృతి- 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం - People Died Due to Heavy Rains

45 People Died Due to Heavy Rains in AP : రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 45 మంది మృతి చెందినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలియచేసింది. ఒక్క ఎన్టీఆర్ జిల్లా లోనే 35 మంది మృతి చెందారని వెల్లడించింది. అలాగే 473 పశువులు, 71,639 కోళ్లు మృతి చెందినట్లు స్పష్టం చేసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:32 PM, 08 Sep 2024 (IST)

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra

Red Alert for North Andhra: ఏపీకి వాన గండం ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే కృష్ణా జిల్లా అతలాకుతలం అయ్యింది. తాజాగా వరుణుడు ఉత్తరాంధ్ర వైపు కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయో రెండురోజుల్లో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ.. వాతావరణ శాఖ రెడ్ అలర్డ్ జారీ చేసింది. అటు విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలతో స్థానికులు భయం గుప్పిట్లో ఉన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:15 PM, 08 Sep 2024 (IST)

అల్లూరి జిల్లాలో విస్తారంగా వర్షాలు- గిరిజనులకు తప్పని కష్టాలు - Rains in Alluri District

Heavy Rains in AP : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి జిల్లా అతలాకుతలమవుతోంది. వాగులు, గడ్డలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వర్షాలకు రాకపోకలు స్తంభించడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:20 PM, 08 Sep 2024 (IST)

విజయవాడలో ముమ్మరంగా వరద సహాయక చర్యలు- నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం - FLOOD RELIEF PROGRAMMES

Flood Relief Programmes in Vijayawada : బుడమేరు వరద తాకిడికి అతలాకుతలమై విజయవాడ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు, ఫైరింజన్లు సిబ్బంది రంగంలోకి దిగారు. వీరితో పాటు ఆరోగ్య బృందం ముంపు ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యబారిన పడకుండా సేవలు అందజేస్తున్నారు. మరోవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆహారం, పాలు, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేస్తున్నాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:17 PM, 08 Sep 2024 (IST)

విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు- ఒరిస్సాతో నిలిచిన రాకపోకలు - FLOOD IN VIZIANAGARAM DISTRICT

Floods in Vizianagaram District: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షం కురుస్తోంది. మడ్డువలస జలాశయం 6 ప్రధాన గేట్లు ఎత్తి సుమారు 16 వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి అధికారులు వదిలారు. వరి, చెరుకు పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:37 PM, 08 Sep 2024 (IST)

వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం గణన- రేపటి నుంచే మూడు రోజుల్లో పూర్తి - AP Floods Damage

AP Floods Damage : వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం గణన చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోదియా తెలిపారు. గణన సమయంలో నివాసితులు వారి గృహాల్లో అందుబాటులో ఉంటే పూర్తి స్ధాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి సిద్దం చేసిన బృందాలకు విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం వేదికగాఒక రోజు శిక్షణ పూర్తి చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:27 AM, 08 Sep 2024 (IST)

వెదర్ రాష్ట్రానికి మరో వాయు"గండం" - ఉరకలేస్తున్న కృష్ణా, గోదావరి- ఉప్పొంగుతున్న వాగులు - RAINS Alert

AP Rains Today 2024 : అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల పైకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:13 AM, 08 Sep 2024 (IST)

"ఆపరేషన్ చిరుత"- రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో అటవీశాఖ అలర్ట్ - LEOPARD SPOTTED IN RAJAHMUNDRY

Cheetah in East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం నగర శివారులో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. శివారు ప్రాంతాల్లో చిరుత జాడ కోసం అటవీ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాప్​ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పరిశీలిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:47 AM, 08 Sep 2024 (IST)

బడి పిల్లల ఫేవరేట్ భాస్కర్​రావు మాస్టారు- ఆయన జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకం - Bhaskar Rao Teacher Special Story

Special Story On Nellore Teacher : దివ్యాంగుడని ఏనాడూ కుంగిపోలేదు. విద్య ఉంటేనే సమాజంలో గౌరవం అని భావించారు. ఆర్థిక కష్టాలను అధిగమించుకుంటూ లక్ష్యసాధన కోసం కష్టపడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి ఆశయానికి అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించారు. ఒక్కో మెట్టూ ఎదుగుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్‌గా అవార్డు సైతం అందుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నారు నెల్లూరు మాస్టారు భాస్కర్​రావు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:39 AM, 08 Sep 2024 (IST)

ఊరూ, వాడా 'గణేష్ మహరాజ్ కీ జై'- వివిధ రూపాల్లో భక్తులకు కనువిందు - GANESH CHATURTHI CELEBRATIONS IN AP

Ganesh Chaturthi Festival was Celebrating Grandly in AP : గణేశ్ నవరాత్రోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటున్నారు. ఊరువాడల్లో గణనాథుడి మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. వివిధ రూపాల్లో కొలువు దీరిన వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:00 AM, 08 Sep 2024 (IST)

యుద్ధప్రాతిపదికన ప్రకాశం బ్యారేజ్​ గేట్ల పనులు- రికార్డు టైమ్‌లో కౌంటర్ వెయిట్ల బిగింపు - PRAKASAM BARRAGE GATES WORKS

Prakasam Barrage Gates Repair Works Speed Up in Vijayawada : ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మధ్య చిక్కుకున్న బోట్లను తొలగించేందుకు ఇంజినీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కీలకమైన 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను కన్నయ్య నాయుడు సారథ్యంలో అధికారులు విజయవంతంగా అమర్చారు. పైనుంచి జోరు వర్షం కురుస్తున్నా, కింద లక్షన్నర క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నా తాడు, క్రేన్లు సాయంతో రంగంలోకి దిగి సాహసోపేతంగా పనిచేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:10 AM, 08 Sep 2024 (IST)

'ఆ రోజు రాత్రి ఏం జరిగింది?, ఆ పడవలు ఎవరివి?'- కుట్ర కోణంపై పోలీసుల దర్యాప్తు - Prakasam Barrage Boat Incident

Collision of Boats in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఆ పడవలు ఎవరివి ఎందుకు వచ్చాయి? ఎవరైనా కావాలని వదిలేశారా లేక నదీ ప్రవాహానికి కొట్టుకొచ్చాయా ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే వాటికి వైఎస్సార్సీపీ రంగులు ఉండటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలన్న ఇంజినీరింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. | Read More

Last Updated : Sep 8, 2024, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.